కడప జిల్లాలో కొనసాగుతున్న వరద బీభత్సం... కుప్పకూలిన పాపాగ్ని నది బ్రిడ్జి...

Papagni river bridge collapsed: కడప జిల్లా కమలాపురంలోని పాపాగ్ని నదిపై ఉన్న బ్రిడ్జి భారీ వరదలకు కుప్పకూలింది. వరద ప్రవాహానికి పిల్లర్లు కుంగిపోవడంతో బ్రిడ్జి కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2021, 10:22 AM IST
  • కడప జిల్లాలో కూలిపోయిన పాపాగ్ని నది బ్రిడ్జి
    పిల్లర్లు కుంగిపోవడంతో ఏడు మీటర్లకు పైగా కూలిన బ్రిడ్జి
    ఆ మార్గంలో పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు
కడప జిల్లాలో కొనసాగుతున్న వరద బీభత్సం... కుప్పకూలిన పాపాగ్ని నది బ్రిడ్జి...

Papagni river bridge collapsed: కడప జిల్లాలో వరద బీభత్సం (heavy rains in Kadapa) కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి కమలాపురంలో పాపాగ్ని నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. శనివారం (నవంబర్ 20) సాయంత్రం నుంచే బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఎగువన ఉన్న వెల్లిగల్లు జలాశయం నాలుగు గేట్లు ఎత్తివేయడంతో పాపాగ్నికి వరద పోటెత్తింది. రెండు రోజులుగా ఆ వరద ఉధృతికి బ్రిడ్జి పిల్లర్లు కుంగుతూ వచ్చాయి. తాజాగా ఏడు మీటర్లకు పైగా ఆ బ్రిడ్జి కూలిపోయినట్లు తెలుస్తోంది.

కడప-అనంతపురం (Kadapa) జాతీయ రహదారిలో ఉన్న బ్రిడ్జి కావడంతో ఆ మార్గంలో వెళ్లే వాహనాలకు ఇబ్బందులు తప్పట్లేదు. కడప నుంచి తాడిపత్రి (Tadipatri) వెళ్లే వాహనాలను ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, మైదుకూరు మీదుగా దారి మళ్లిస్తున్నారు. ఈ బ్రిడ్జిపై రాకపోకలను పునరుద్ధరించేందుకు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.

ఇక ఇదే కడప (Kadapa) జిల్లాలో చోటు చేసుకున్న మరో ఘటనలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. జిల్లా కేంద్రంలోని రాధాకృష్ణనగర్‌లో తెల్లవారుజామున 4 గంటల సమయంలో మూడంతస్తుల ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న ఓ మహిళను, ఆమె ఇద్దరు పిల్లలను కాపాడారు. భవనం కుప్పకూలడానికి ముందు పెద్ద శబ్దం రావడంతో భవనంలోని రెండు, మూడు అంతస్తుల్లో ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. 

Also Read: కరోనా నుంచి కోలుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

మొదటి అంతస్తులో ఉంటున్న మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు మాత్రమే అందులో చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనే ఈ భవనానికి కడప (Kadapa) కార్పోరేషన్ అధికారులు మూడుసార్లు నోటీసులిచ్చినట్లు చెబుతున్నారు. భవనం కుప్పకూలడంతో కట్టుబట్టలు తప్ప ఇక తమకేమీ మిగలేదని బాధితులు వాపోతున్నారు. అనంతపురం జిల్లా కదిరిలోనూ మూడంతస్తుల ఓ భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News