Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వానికి జనసేన సపోర్ట్.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: పవన్ కళ్యాణ్‌

Global Investment Summit 2023: విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. రెండురోజుల పాటు జరిగి ఈ సమ్మిట్‌లో అతిథులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వమించనున్న ఈ కార్యక్రమంపై రాష్ట్రమంతా ఫోకస్ చేస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2023, 09:04 PM IST
Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వానికి జనసేన సపోర్ట్.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: పవన్ కళ్యాణ్‌

Global Investment Summit 2023: జగన్ సర్కారుకు తొలిసారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ సపోర్ట్ చేశారు. విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ నిర్వహిస్తున్నందుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రెండు రోజులు ప్రభుత్వంపై ఎలాంటి రాజకీయ విమర్శలు చేయబోమని.. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి జనసేన  సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. రాజకీయం కంటే రాష్ట్రమే మిన్న అని పవన్ కళ్యాణ్‌ ట్వీట్ చేశారు.

'దేశవిదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోంది. మా శక్తివంతమైన, అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ యువత మిమ్మల్ని మెప్పిస్తారని భావిస్తున్నాను. ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు మన యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించడంతోపాటు ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం  పొందుతారని ఆశిస్తున్నాను.

వైసీపీ ప్రభుత్వానికి నా హృదయపూర్వక విన్నపం. ఏపీలో ఆర్థికాభివృద్ధికి ఉన్న  అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించండి. రివర్స్‌ టెండరింగ్‌, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించండి. ఈ సమ్మిట్‌ ఆలోచనలను కేవలం వైజాగ్‌కే పరిమితం చేయకండి. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప.. ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించండి.

దీన్ని కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా ఏపీ మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్ల సమ్మిట్‌లాగా మార్చండి. రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదు. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ విమర్శలు చేయం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి  సంపూర్ధ మద్దతును అందిస్తోంది. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ సందర్భంగా ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియచేస్తోంది. రాజకీయం కంటే రాష్ట్రం మిన్న..' అని పవన్ కళ్యాణ్‌ అన్నారు. 

 

Also Read: Election Results 2023: ఈశాన్యంలో కాషాయ రెపరెపలు.. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇలా..  

Also Read: Tax Saving Tips: ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వారికి గమనిక.. పన్ను ఇలా ఆదా చేసుకోండి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News