/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

న్యాయవ్యవస్థపై చర్చ జరగాలా వద్దా ..ఇప్పుడిదే అంశం చర్చనీయాంశమైంది. రాజ్యాంగం ప్రకారం అన్ని వ్యవస్థలూ ఒక్కటేనని కొందరంటుంటే...న్యాయవ్యవస్థ అతీతమైందని మరి కొందరంటున్నారు. ఇప్పుడీ అంశంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ( Undavalli Arun kumar ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ ( Supreme court justice N V Ramana ) పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) నేరుగా సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డేకు లేఖ రాయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ విషయంపై విభిన్న రకాల వాదనలు వస్తున్నాయి. జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ హైకోర్టును ప్రభావితం చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణగా ఉంది. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఏపీ హైకోర్టులో చుక్కెదురవుతూ పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అమరావతి భూముల కుంభకోణం కేసు ( Amaravati lands scam ) లో సీఐడీ దర్యాప్తును ఆపాల్సిందిగా సూచిస్తూ గ్యాగ్ ఆర్డర్ వెలువరించినప్పుడు పరిస్థితి పరాకాష్ఠకు చేరింది. పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీలు దీనిపై చర్చ లేవదీశారు. ఆందోళన నిర్వహించారు. 

అప్పట్నించి శాసనవ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం తగదనే వాదన ప్రారంభమైంది. అనంతరం తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా సీజేఐ ( CJI )కు లేఖ రాశారు. జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదు చేస్తూ..ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ లేఖ దేశవ్యాప్తంగా సంచలనమైంది. తాజాగా తెలంగాణలోని ఓ న్యాయవాది ఇంచుమించు ఇదే అంశాలతో సుప్రీంకోర్టుకు నెలరోజుల క్రితం రాసిన లేఖను సుప్రీంకోర్టు ( Supreme court ) పిల్ గా స్వీకరించి విచారణ జరపనున్నామని స్పష్టం చేయడం జగన్ రాసిన లేఖకు ప్రాధాన్యత తెచ్చిపెట్టింది. జూనియర్ న్యాయవాదులు సైతం ఏపీ హైకోర్టులో వ్యాజ్యాలు వేస్తూ కావల్సినవిధంగా స్టేలు ఎలా తెచ్చుకుంటున్నారనేది ఆ లేఖలో న్యాయవాది వివరించారు. 

ఇప్పుడీ అంశంపై ప్రముఖ విశ్లేషకులు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. న్యాయవ్యవస్థపై చర్చ జరగాల్సిందేనని...రాజ్యాంగం ప్రకారం అన్ని వ్యవస్థలు ఒక్కటేనని చెప్పారు. జగన్‌ రాసిన లేఖలోని అంశాలు ప్రజలకు తెలియాలని కూడా ఉండవల్లి చెప్పారు. సీఐడీ దర్యాప్తు విషంలో అసలు హైకోర్టు ( Ap High court ) గ్యాగ్‌ ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ఉండవల్లి ప్రశ్నించారు. మరో కేసు విషయంలో ఏపీ హైకోర్టు డీజీపీని పిలిపించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. గతంలో జడ్జీలపై ఎఫ్‌ఐఆర్‌ కట్టిన సందర్భాలున్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు. మార్గదర్శి కేసును సుప్రీంకోర్టులో విచారణకు రాకుండా చేసిన సందర్భాలున్నాయని చెప్పుకొచ్చారు.

ప్రజాప్రతినిధుల కేసులను వర్చువల్‌ కోర్టుల్లో విచారించాలని..తన ఈ సూచనల్ని సీజేఐకు మెయిల్ చేశానన్నారు. ముఖ్యమైన కేసుల్లో కోర్టు ప్రక్రియను లైవ్‌ టెలీకాస్ట్‌లో చూపించాలని కోరారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కేసులేంటనేది ప్రజలకు తెలియాలని అరుణ్‌ కుమార్‌ తెలిపారు. న్యాయవ్యవస్థపై గతంలో కూడా ముఖ్యమంత్రులు లేఖలు రాసి ఉన్నారని..ఇదేమీ కొత్తకాదని చెప్పారు. Also read: AP EAMCET 2020: ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల

Section: 
English Title: 
Ex mp undavalli Arun kumar sensational comments on jagan’s letter to CJI
News Source: 
Home Title: 

Debate on Judiciary: జగన్ లేఖలోని అంశాలు ప్రజలకు తెలియాల్సిందే: ఉండవల్లి

Debate on Judiciary: జగన్ లేఖలోని అంశాలు ప్రజలకు తెలియాల్సిందే: ఉండవల్లి
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Debate on Judiciary: జగన్ లేఖలోని అంశాలు ప్రజలకు తెలియాల్సిందే: ఉండవల్లి
Publish Later: 
No
Publish At: 
Saturday, October 17, 2020 - 14:54
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman