Weather updates: చుక్కల చూపిస్తున్న చలి.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

Weather updates: తెలుగు రాష్ట్రాల ప్రజలను చలి పులి చంపేస్తోంది. పడిపోతున్న ఉష్ణ్రోగ్రతల వల్ల ప్రజలు గజగజ వణికిపోతున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2022, 09:15 AM IST
Weather updates: చుక్కల చూపిస్తున్న చలి.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

Temperatures are low in telugu states: తెలుగు రాష్ట్రాల ప్రజలను చలి పులి వణికిస్తోంది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్‌ వ్యాధులతో పాటు శ్వాసకోశ సమస్యల బారిన పడుతున్నారు.  ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్, రంగారెడ్డి.. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో చలితీవ్రత మరింత అధికమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి చుక్కలు చూపిస్తోంది. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చింతపల్లిలో 8.2 డిగ్రీల, పాడేరులో 12 డిగ్రీలు, మినుములూరులో 10.1 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. మన్యంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు పొగమంచు కమ్మేస్తోంది. దీంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడం లేదు. ఈ పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం కూడా ఉంది. 

తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. కుమురం భీం జిల్లా సిర్పూరులో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఈశాన్య, తూర్పు భారత ప్రాంతాల నుంచి గాలులు తెలంగాణలోకి ప్రవేశిస్తుండటంతో చలితీవ్రత పెరుగుతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ చలి కారణంగా ఉదయాన్నే ప్రయాణాలు చేయాలనుకునేవారు వాయిదా వేసుకుంటున్నారు. 

Also Read: CM Jagan Mohan Reddy: 175 సీట్లు క్లీన్ స్వీప్‌ లక్ష్యం.. చంద్రబాబు నియోజకవర్గాన్ని గుర్తుచేసిన సీఎం జగన్‌ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News