Ap Rajyasabha Election: ఏపీ రాజ్యసభ అభ్యర్థులు వీళ్లేనా? జగన్ సిగ్నల్ ఇచ్చేశారా?

Ap Rajyasabha Election: ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలాల ప్రకారం మొత్తం నాలుగు రాజ్యసభ సీట్లు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడనున్నాయి.దీంతో పెద్దల సభకు వెళ్లేందుకు వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2022, 05:16 PM IST

    ఏపీలో నాలుగు రాజ్యసీట్లకు జూన్ లో ఎన్నికలు

    అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న జగన్

    విజయసాయి రెడ్డి, ప్రీతి అదానీ పేర్లు ఖరారు!

 Ap Rajyasabha Election: ఏపీ రాజ్యసభ అభ్యర్థులు వీళ్లేనా? జగన్ సిగ్నల్ ఇచ్చేశారా?

Ap Rajyasabha Election: ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. నాలుగు సీట్లకు జూన్ లో ఎన్నిక జరగనుంది. రేపు మాపో రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రానుండటంతో అభ్యర్థులు ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలాల ప్రకారం మొత్తం నాలుగు రాజ్యసభ సీట్లు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడనున్నాయి.దీంతో పెద్దల సభకు వెళ్లేందుకు వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు. అయితే రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కసరత్తును సీఎం జగన్ ఇప్పటికే పూర్తి చేశారని తెలుస్తోంది.
రెండు సీట్ల విషయంలో దాదాపుగా ఖారారు చేసిన జగన్.. మరో సీట్లకు ఇంకా ఫైనల్ చేయలేదని వైసీపీ వర్గాల సమాచారం.

ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీగా ఉన్నారు విజయసాయి రెడ్డి. జగన్ కు అత్యంత సన్నిహితుడైన సాయి రెడ్డికి మరోసారి రాజ్యసభ రెన్యూవల్ ఉంటుందంటున్నారు. గతంలో మాదిరే ఈసారి కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తికి ఒక సీటు ఇస్తారంటున్నారు. క్రితం సారి బడా వ్యాపారవేత్త ముకేష్ అంబానీ స్నేహితుడైన పరిమల్ నత్వానిని రాజ్యసభ సీటు ఇచ్చారు జగన్ రెడ్డి. ఈసారి కూడా  ప్రముఖ పారిశ్రామికవేత్త.. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పే గౌతమ్ అదానీ సతీమణి ప్రీతి అదానీకి ఛాన్స్ ఇస్తారంటున్నారు. మిగితా రెండు సీట్ల కోసం చాలా మంది పోటీ పడుతున్నారని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్, సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మర్రి రాజశేఖర్ కు మూడేళ్లుగా పదవి కోసం వెయిట్ చేస్తున్నారు. రాజమోహన్ రెడ్డి కొడుకు గౌతమ్ రెడ్డి ఇటీవలే చనిపోయారు.

అయితే సీనియర్  న్యాయవాది నిరంజన్ రెడ్డికి కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని జగన్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. రెడ్లకు రెండు, వ్యాపారవేత్తకు ఒక సీటు ఇస్తుండటంతో నాలుగో స్థానాన్ని బీసీ లేదా మైనార్టీ, దళిత వర్గం నుంచి ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దళితుడికి ఇవ్వాలని భావిస్తే మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రేసులో ముందు ఉంటారనే ప్రచారం జరుగుతోంది. బీసీ నుంచి ఇవ్వాలని నిర్ణయిస్తే.. ఉత్తరాంధ్ర నేతకు బంపర్ ఆఫర్ తగలవచ్చంటున్నారు. టీటీడీ చైర్మెన్  వైవీ సుబ్బారెడ్డి కూడా రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. రెండు, మూడు రోజుల్లోనే రాజ్యసభ అభ్యర్థులపై జగన్ క్లారిటీ ఇస్తారని అంటున్నారు.

READ ALSO: Ktr Hot Comments: తెలుగు రాష్ట్రాల మధ్య రచ్చ.. కేటీఆర్ కు బొత్స కౌంటర్

Eluru Garbage Tax: ఏలూరులో వింత ఫిర్యాదు..చెత్తపన్ను కట్టలేదని పోలీస్‌ కేసు..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News