వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే...బాధితులను ఆదుకోవాలని ఆదేశం..

Andhra Pradesh: రాష్ట్రంలో భారీవర్షాలతో అతలాకుతలమవుతున్న చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ ఏరియల్‌ సర్వే నిర్వహించారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2021, 03:41 PM IST
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే...బాధితులను ఆదుకోవాలని ఆదేశం..

Andhra Pradesh: వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ ఏరియల్‌ సర్వే(CM Jagan Aerial survey)  నిర్వహించారు. కడప, చిత్తూరు, నెల్లూరు ఇతర ప్రాంతాలను హెలికాప్టర్‌ ద్వారా పరిశీలించారు. ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి కడప చేరుకున్న ముఖ్యమంత్రి(CM jagan).. అక్కడ నుంచి విహంగ వీక్షణం ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. 

అనంతరం రేణిగుంట, కడప విమానాశ్రయాల్లో అధికారులతో సీఎం సమీక్షించారు. ఆయా విమానాశ్రయాల్లో ఫొటో గ్యాలరీలను పరిశీలించారు. వరద పరిస్థితుల(Flood situation)పై అధికారులకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి.. బాధితులను త్వరితగతిన ఆదుకోవాలని ఆదేశించారు. చిత్తూరు, తిరుమలలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు త్వరితగతిన రూ. 2 వేల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు.

Also read: సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌..ఏపీలోని వరద పరిస్థితులపై ఆరా..

రాష్ట్రంలో భారీ వర్షాల(Heavy Rains in ap)కు ఇప్పటివరకు 21 మంది మృతి చెందారు. అంతేకాకుండా చిత్తూరు, కడప జిల్లాల్లోని విద్యాసంస్థలకు నేడు సెలవు(Holiday) ప్రకటించారు. చెయ్యేరు ఉద్ధృతికి 30 మంది గల్లంతు కాగా...రాజంపేట మండలంలో వరద నీటిలో 3 ఆర్టీసీ బస్సులు చిక్కుకుపోయాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. కదిరిలో రెండు భవనాలు కూలిపోయి నలుగురు మృత్యువాత పడ్డారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News