Modi 3.0 Cabinet: నరేంద్ర మోదీ ౩.౦ కేబినేట్ లో వీరంతా ఔట్.. గెలిచిన వాళ్లకు కూడా ఊహించని షాక్..

Narendra modi oath ceremony: ప్రధానిగా మోదీ మూడో సారి ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అతిరథ మహరథులు హజరయ్యారు. 

1 /6

మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి దేశంనుంచికాకుండా విదేశాల నుంచి అతిరథమహారథులు హజరయ్యారు. దాదాపు పదివేల మంది వరకు కూడా అతిథులు హజరైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండా మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారోత్సవ వేళ కేబినేట్ కూర్పులో అనేక ఆసక్తికర పరిణామలు ఉన్నాయి. 

2 /6

68 మందితో పూర్తి స్థాయి కేంద్రంలో మంత్రులు ఈరోజు మోదీ 3.0 కేబినేట్ లో ప్రమాణ స్వీకారంచేయనున్నట్లు తెలుస్తోంది.  పలు రాష్ట్రాల నుంచి ఎంపీలకు కేంద్రంలో మంత్రులుగా ఈసారి అవకాశం వచ్చింది.

3 /6

లోక్ సభలో ఈసారి కొంత మంది సీనియర్లకు, గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసినవారికి సైతం ఈసారి కేబినేట్ లో స్థానం లభింయలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో మోదీ మంత్రి వర్గంలో.. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ్ రాణేలకు ఈ సారి మంత్రి పదవులు దక్కదని సమాచారం.

4 /6

స్మృతీ ఇరానీకి  ఈసారి బీజేపీ హైకమాండ్ బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ బరిలోకి దిగిన స్మృతీ ఇరానీ..  కాంగ్రెస్ కు చెందిన కిషోరీ లాల్ శర్మ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉండగా..  గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతీ..  ఈ సారి మాత్రం విజయం సాధించలేకపోయారు. గతంలో మోడీ మంత్రివర్గంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు.

5 /6

మరోవైపు.. హిమాచల్ ప్రదేశ్ హమీర్ పూర్ నుంచి ఎంపీగా గెలిచిన అనురాగ్ ఠాకూర్‌కి బీజేపీ ట్విస్ట్ ఇచ్చింది. మోదీ 3.0 మంత్రి వర్గంలో.. ఆయనకు పదవి దక్కదని సమాచారం. ప్రధాని మోడీ రెండో టర్మ్‌లోని మంత్రివర్గంలో ఈయన క్రీడలు, సమాచార, ప్రసార శాఖల మంత్రిగా పనిచేశారు.  

6 /6

మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత, రత్నగిరి-సింధు దుర్గ్ నుంచి విజయం సాధించిన నారాయణ రాణేకి కూడా ఈ సారి మోదీ మంత్రి వర్గంలో సీటు కాన్ఫామ్‌ కాలేదని తెలుస్తోంది. గతంలో ఆయన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. ఇక నిసిత్ ప్రమాణిక్ లకు కూడా బీజేపీ అధినాయత్వం ఈసారి మోండి చేయి చూపించినట్లు తెలుస్తోంది. ఇక ఎంపీలుగా గెలిచిన వారికి, మరికొందరు సీనియర్లుకూడా మోదీ తర్వాత కేబినేట్ విస్తరణలో చోటు కల్పిస్తారని తెలుస్తోంది.