Darshan: సినిమా ఇండస్ట్రీలో పెనుదుమారం.. మర్డర్ కేసులో అరెస్టైన స్టార్ హీరో.. అసలేం జరిగిందంటే..?

Darshan Arrested: కన్నడ ఫెమస్ నటుడు దర్శన్ ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతగాడు.. రేణుక స్వామి అనే వ్యక్తిని హత్య చేయించాడని ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Jun 11, 2024, 01:45 PM IST
  • నటికి అభ్యంతరకర మెస్సెజ్ లు..
  • హత్య కేసులో ఇరుక్కున్న హీరో దర్శన్ అరెస్టు..
Darshan: సినిమా ఇండస్ట్రీలో పెనుదుమారం.. మర్డర్ కేసులో అరెస్టైన స్టార్ హీరో.. అసలేం జరిగిందంటే..?

Kannada actor Darshan thoogudeepa arrestedin murder case: మూవీ ఇండస్డ్రీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల సినిమా రంగంలోని వారు తరచుగా వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నారు. బెంగళూరులో రేవ్ పార్టీ ఘటన ఇరు తెలుగు స్టేట్స్ లలో తీవ్ర సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈకేసులో టాలీవుడ్ నటి ఇప్పటికే బెంగళూరులో రిమాండ్ లో ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నడ నటుడు దర్శన్ ను పోలీసులు ఒక హత్య కేసులో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. దర్శన్, నటి పవిత్ర గౌడతో సన్నిహితంగా ఉంటారు.

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

ఇండస్డ్రీలో కూడా వీరి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో.. నటి పవిత్రతో సన్నిహితంగా ఉండేవాడు దర్శన్. ఎక్కడికి వెళ్లిన ఇద్దరు కలసి వెళ్లేవారు. ఇదిలా ఉండగా.. నటి పవిత్రకు.. రేణుక స్వామి అనే వ్యక్తి తరచుగా అభ్యంతరకర మెసెజ్ లు పంపిస్తు, ఇబ్బందులు పెట్టేవాడని దర్శన్ కు చెప్పింది. దీంతో అతగాడు దీనిపై రేణుక స్వామి మర్డర్ కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీని కోసం నలుగురికి సుపారీ ఇచ్చినట్లు సమాచారం.  బెంగుళూరులోని కామాక్షిపాలయంలో రేణుకాస్వామి సుపారీ గ్యాంగ్ హత్య చేసినట్లు తెలుస్తోంది.

దీంతో బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగి ఘటనపై ఆరా తీశారు. కన్నడ నటుడు దర్శన్ పాత్ర కీలకంగా ఉండటంతో అతడిని మైసూర్ లోనిన ఒక ఫామ్ హౌస్ కు వెళ్లి అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నటుడు..దర్శన్ సూచన మేరకే హత్య చేసినట్లు నలుగురు నిందితులు అంగీకరించారు. ఘటన జరిగిన సమయంలో దర్శన్ కూడా అక్కడే ఉన్నట్టు సమాచారం. ఈ కేసులో దర్శన్ సహా 10 మందిని అరెస్టు చేసినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు.  ఈ ఘటన జూన్ 9వ తేదీన జరిగినట్లు తెలుస్తొంది.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

రేణుకా స్వామిని  బెంగళూరుకు తీసుకువచ్చి, చిత్ర హింసలకు గురిచేసి చంపినట్లు తెలుస్తోంది. అనంతరం డెడ్ బాడీనీ  కల్వర్టులో పడేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన మాత్రం ఇటు సినీ ఇండస్డ్రీలో పెనుదుమారంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News