LIC Jeevan Anand Policy: రోజుకు 45 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 25 లక్షలు అందుకోవచ్చు

LIC Jeevan Anand Policy: దేశంలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ నుంచి ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలు అందుబాటులో వస్తున్నాయి. అలాంటిదే జీవన్ ఆనంద్ పాలసీ. రోజుకు 45 రూపాయుల ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 25 లక్షలు వచ్చే అవకాశముంది. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 9, 2024, 08:06 PM IST
LIC Jeevan Anand Policy: రోజుకు 45 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 25 లక్షలు అందుకోవచ్చు

LIC Jeevan Anand Policy: ఎల్ఐసీలో ప్రతి ఒక్కరికీ అన్ని కేటగరీలవారికి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. చిన్నారుల్నించి మొదలుకుని పెద్దలవరకూ అందరికీ పాలసీలున్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్దమొత్తంలో డబ్బులు చేతికి అందుతాయి. అసలీ జీవన్ ఆనంద్ పాలసీ అంటే ఏమిటి, ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

జీవన్ ఆనంద్ పాలసీ అనేది తక్కువ ప్రీమియం చెల్లిస్తూ అధిక రిటర్న్స్ ఆర్జించాలంటే మంచి ప్లాన్. టెర్మ్ పాలసీ లాంటిది. పాలసీ పూర్తయ్యేవరకూ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో గరిష్ట పరిమితి లేదు. ఈ పాలసీలో రోజుకు 45 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే నెలకు 1358 రూపాయలవుతుంది. మెచ్యూరిటీ పూర్తయ్యాక చేతికి ఏకంగా 25 లక్షల రూపాయలు అందుతాయి. ఈ పాలసీ కాల వ్యవధి 15 ఏళ్ల నుంచి 35 ఏళ్లుంటుంది. రోజుకు 45 రూపాయల చొప్పున 35 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తరువాత ఒకేసారి 25 లక్షల రూపాయల భారీ మొత్తం అందుతుంది. ఏడాదికి మీరు ఇన్వెస్ట్ చేసేది 16,300 రూపాయలు. 

అంటే నెలకు 1358 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి 16,300 రూపాయలవుతుంది. 35 ఏళ్లకు మీరు ఇన్వెస్ట్ చేసేది 5,70,500 రూపాయలు మాత్రమే.  ఫైనల్ బోనస్ 11.509 లక్షలుంటుంది. ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ కచ్చితంగా 15 ఏళ్లకు చేయాల్సిందే. 

Also read: Hero Xoom Scooter: హీరో జూమ్ కొత్త కంబాట్ ఎడిషన్ వచ్చేసింది.. ధర, ఫీచర్స్‌ వివరాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News