HBD Balakrishna: నందమూరి బాలకృష్ణ .. నందమూరి తారకరామారావు నట వారసుడిగా అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు గత 5 దశాబ్దాలుగా స్టార్ హీరోగా సత్తా చూపెడుతునే ఉన్నాడు. అంతేకాదు ఎన్టీఆర్ నట వారసుడిగానే కాకుండా రాజకీయ వారసుడిగా 2014లో తొలిసారి హిందూపుర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పట్లో బాలయ్య.. చంద్రబాబు మంత్రివర్గంలో చేరి మంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆయన అభిమానులు ఆశించారు. కానీ బాలయ్య.. సినిమాలే లోకంగా మరోవైపు తన నియోజకవర్గ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. అంతేకాదు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా బాధ్యతలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక రెండోసారి వైసీపీ ప్రభంజనంలో కూడా బాలయ్య హిందూపుర్ నుంచి విజయం సాధించారు.
ఇక 2024లో మూడోసారి హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. కానీ ఈ సారి తెలుగు దేశం కూటమి తరుపున అఖండ విజయం సాధించడం విశేషం. మరి ఈ సారైనా.. బాలయ్య మంత్రిగా చంద్రబాబు మంత్రివర్గంలో బాధ్యతలు స్వీకరిస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు బాలయ్యను మంత్రిగా చూడాలనుకునే అభిమానులున్నారు. ఇంకొంత మంది ఆయన్ని ముఖ్యమంత్రి పీఠంపై చూడాలని కోరుకుంటున్నారు. కానీ అది సాధ్యమయ్య విషయం కాదు. కానీ మినిష్టర్ అయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి.. బాలయ్య కోరుకుంటే చంద్రబాబు మంత్రివర్గంలో చేరడం పెద్ద విషయం కాదు. కానీ బాలయ్య చేరితో ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మంత్రి పదవులు అనే కాన్సెప్ట్ మొదలవుతోంది. మరి బాలయ్య వాటికి చెక్ పెట్టేలా మంత్రి వర్గంలో చేరకుండా మామలు ఎమ్మెల్యేగానే కొనసాగుతారా అనేది చూడాలి.
వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమ హీరోకు ఈ సారైనా ఏపీ మంత్రి వర్గంలో స్థానం ఇస్తే బాగుంటుందని బాలయ్య అభిమానులతో పాటు సగటు తెలుగు దేశం అభిమానులు కోరుకుంటున్నారు. మరి దాన్ని బాలయ్య నెరవేరుస్తారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం బాలయ్య.. బాబీ కొల్లి దర్శకత్వంలో 109 సినిమా చేస్తున్నారు. మరికాసేట్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన చేయనున్నారు. ఇంకోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నాల్గోసారి పనిచేయడానికి రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన చేసారు.
Also read: kangana ranaut: లేడీ కానిస్టేబుల్ కు గోల్డ్ రింగ్, జాబ్ ఆఫర్.. కంగానా రనౌత్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook