7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త ప్రభుత్వంలో మొదటి గుడ్‌న్యూస్ అదే..!

7th Pay Commission DA News 2024: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని నమ్మకంతో ఉన్నారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 

  • Jun 11, 2024, 12:38 PM IST
1 /8

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు పూర్తి కావడంతో ఉద్యోగులు సంతోషంలో ఉన్నారు. గత కొంతకాలంగా చర్చల్లో ఉన్న 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని అంటున్నారు.  

2 /8

ప్రతి పది సంవత్సరాలకు కొత్త పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 7వ వేతన సంఘం 2014లో ఏర్పాటు చేయగా.. 2016 జనవరిలో అమలులోకి వచ్చింది. కొత్త పే కమిషన్‌ను ప్రకటించిన తరువాత దాదాపు 2 సంవత్సరాలలో అమలులో వస్తుంది. కొత్త పే కమిషన్‌పై ఇప్పుడు ప్రకటన వస్తే.. 2026లో అమలు చేయవచ్చు.  

3 /8

కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కొత్త పే కమిషన్ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపునకు సంబంధించి కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సులు సమర్పించనుంది.   

4 /8

కొత్త పే కమిషన్ ఏర్పాటు ఆలోచన లేదని గతేడాది డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోవడంతో కేంద్రం నుంచి శుభవార్త వస్తుందని ఉద్యోగులు ఆశతో ఉన్నారు.  

5 /8

8వ వేతన సంఘం అమలులోకి వస్తే.. 49 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లో పెరుగుదలతో పాటు ఉద్యోగుల జీతంలో కూడా పెంపుదల ఉండనుంది.   

6 /8

ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ శాలరీ రూ.18 వేలు అనుకుంటే.. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పెంపుతో వారి బేసిక్ జీతం రూ.8 వేలు పెరిగి మొత్తం రూ.26 వేలకు చేరుతుంది.   

7 /8

7వ వేతన సంఘంలో 2.57 రెట్ల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ ప్రవేశపెట్టడంతో ఉద్యోగుల జీతం దాదాపు 14.29 శాతం పెరిగింది. దీంతో పాటు బేసిక్ శాలరీని కూడా రూ.18 వేలకు పెంచారు. 8వ వేతన సంఘం అమలుతో వేతన వ్యత్యాసాలు తొలగిపోవడమే కాకుండా ద్రవ్యోల్బణం ప్రభావం కూడా తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.   

8 /8

గమనిక: ఈ సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే అందజేసినది. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.