Church father harassment: కర్నూలు జిల్లాలో దారుణం...ఇద్దరు బాలికలపై పాస్టర్ లైంగిక వేధింపులు!

కర్నూలు జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పాస్టర్ ఇద్దరు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళితే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 06:34 PM IST
Church father harassment: కర్నూలు జిల్లాలో దారుణం...ఇద్దరు బాలికలపై పాస్టర్ లైంగిక వేధింపులు!

Kurnool District: ఓ పాస్టర్ ఇద్దరు బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన కర్నూలు జిల్లా(Kurnool District)లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రసన్నకుమార్ అనే ఓ చర్చి పాస్టర్ ఇద్దరు బాలికలపై లైంగిక వైధింపుల(Sexual harassment)కు పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు పెద్ద మనుషుల ద్వారా పంచాయితీ పెట్టారు. అయితే ఓ వీడియో ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. పాస్టర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన గత నెల 16న జరిగినప్పటికీ..ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

Also read: Williams‌ case : నిత్య పెళ్లికొడుకు విలియమ్స్‌ కేసులో మరో ట్విస్ట్

చాగలమర్రి మండలంలో ప్రసన్న కుమార్ ఓ చర్చికి పాస్టర్‌(Church Pastor‌) గా ఉన్నాడు. సమీప ప్రాంతంలో పెద్దలు పనికి వెళ్లిన సమయంలో.. బాలికలను ప్రేయర్‌ పేరుతో చర్చిలోకి తీసుకువెళ్లేవాడు. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులకు మాయమాటలు చెప్పి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలికలు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో పాస్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. గ్రామ పెద్దలు సమక్షంలో రాజీ ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. రాజీ వ్యవహారంలో కొంత డబ్బు చేతులు మారినట్టు తెలుస్తోంది. 

Also Read: Life imprisonment for gang rape : అత్యాచార వీడియో వెలుగులోకి వచ్చి ఐదుగురికి యావజ్జీవం

ఈలోగానే చర్చి పాస్టర్​పై వచ్చిన ఆరోపణలను నిరూపించే వీడియో(church father sexually assaulted two girls)ను కొందరు గ్రామస్థులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు.. సదరు చర్చి పాస్టర్(church father sexually assaulted two girls)​పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News