AP Pension Distribution: అధికారంలో ఎవరు ఉన్నా ప్రభుత్వ పథకాలను మాత్రం ఆ గ్రామం నుంచే ప్రారంభిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే గ్రామం నుంచి పథకం ప్రారంభించగా.. తాజాగా చంద్రబాబు నాయుడు కూడా అదే ఊరి నుంచి ప్రభుత్వ పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ఇంతకీ గ్రామానికి ప్రత్యేకత ఏముంది? ఎందుకు ఇద్దరు సీఎంలు అక్కడి నుంచే పథకాలు ప్రారంభిస్తున్నరో తెలుసుకోండి.
Also Read: TDP Toll Free: మీ సమస్య సీఎం చంద్రబాబుకు చెప్పాలా? అయితే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ల పెంపును జూలై 1వ తేదీ సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. రూ.వెయ్యి పెంచిన పింఛన్‌తోపాటు ఏప్రిల్, మే, జూన్ నెలకు కలిపి జూలైకు సంబంధించిన పించన్ రూ.7 వేలు లబ్ధిదారులకు అందనున్నాయి. సామాజిక పింఛన్ల పంపిణీ ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద చేపట్టనున్నారు. అయితే ఈ పింఛన్ల పంపిణీని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. గతంలో ఇదే గ్రామం నుంచే నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభించడం విశేషం.
Also Read: Ali Resign: రాజకీయాలు నా వల్ల కాదు.. ఇక సినిమాలు చేసుకుంటా: అలీ సంచలన ప్రకటన
ఇద్దరు ముఖ్యమంత్రులు వేర్వేరు కార్యక్రమాలైనా జగన్, చంద్రబాబు పెనుమాకనే ఎంచుకోవటం ఆసక్తికరం. అయితే ఈ గ్రామం రాజధాని అమరావతికి చేరువలో ఉండడమే కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వ పరిపాలనకు చేరువ ఉండడంతో ఈ గ్రామాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. తన తనయుడు నారా లోకేశ్‌కు అత్యధిక మెజార్టీ అందించిన మంగళగిరి నియోజకవర్గం కూడా ఈ గ్రామం కిందకే వస్తుండడంతో ఈ గ్రామాన్ని ఎంచుకున్నట్లు చర్చ జరుగుతోంది. కాగా పింఛన్ల పంపిణీ కోసం పెనుమాక గ్రామంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ గ్రామాన్ని భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఎన్టీఆర్ భరోసా పథకం
సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ పథకానికి చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్చింది. తొలిరోజే 100 శాతం పంపిణీ పూర్తిచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పింఛన్లను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితోపాటు ఇతర శాఖలకు చెందిన క్షేత్ర స్థాయి ఉద్యోగులు అందించనున్నారు.
భారీగా పింఛన్లు
పింఛన్ల పంపిణీ ప్రారంభించిన అనంతరం పెనుమాక గ్రామంలో ప్రజావేదిక నిర్వహించనున్నారు. చంద్రబాబు నాయుడు పింఛను లబ్ధిదారులు, ప్రజలతో ముచ్చటించనున్నారు. రాష్ట్రంలో ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు రూ.4,408 కోట్లు పంపిణీ చేయనున్నారు. కాగా ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని పింఛన్ల పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి