Chandrababu Shock: టీడీపీకి కేఈ బ్రదర్స్ గుడ్ బై? కర్నూల్ జిల్లా తమ్ముళ్లలో కలకలం..

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. బాదుడే బాదుడు కార్యక్రమంతో జోరుగా జనంలోకి వెళుతున్నారు.ఇంతలోనే చంద్రబాబుకు షాకింగ్ ఎదురుకాబోతోందని తెలుస్తోంది. టీడీపీకి సీనియర్ నేత కుటుంబం గుడ్ బై చెప్పబోతుందనే ప్రచారం జరుగుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 10:58 AM IST
  • డోన్ టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డి
  • చంద్రబాబు ప్రకటనతో కేఈ ఫ్యామిలీ షాక్
  • టీడీపీని వీడే యోచనలో కేఈ సోదరులు
Chandrababu Shock: టీడీపీకి కేఈ బ్రదర్స్ గుడ్ బై? కర్నూల్ జిల్లా తమ్ముళ్లలో కలకలం..

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. బాదుడే బాదుడు కార్యక్రమంతో జోరుగా జనంలోకి వెళుతున్నారు. జగస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ గర్జించారు చంద్రబాబు. టీడీపీ అధినేత కడప పర్యటనకు జనాల నుంచి మంచి స్పందన వచ్చిందనే టాక్ వస్తోంది. టీడీపీ ఊహించినదానికంటే ఎక్కువగా జనాలు వచ్చారని అంటున్నారు. కడప జిల్లా ఇచ్చిన జోష్ తో కర్నూల్ జిల్లాలో పర్యటించారు చంద్రబాబు. రాయలసీమలో చంద్రబాబు పర్యటనలతో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందనే ధీమాతో తమ్ముళ్లు ఉన్నారు. ఇంతలోనే చంద్రబాబుకు షాకింగ్ ఎదురుకాబోతోందని తెలుస్తోంది. టీడీపీకి సీనియర్ నేత కుటుంబం గుడ్ బై చెప్పబోతుందనే ప్రచారం జరుగుతోంది.

కర్నూల్ జిల్లాలో టీడీపీకి మొదటి నుంచి అండగా ఉంది కేఈ కుటుంబం. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు కేఈ కృష్ణమూర్తి. కోట్ల , భూమా కుటుంబాలను ధీటుగా ఎదుర్కొన్నారు కేఈ బ్రదర్స్. అయితే త్వరలోనే కేఈ సోదరులు తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వస్తారనే చర్చ సాగుతోంది. ఇందుకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయమే కారణమంటున్నారు. కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా ఓ సంచలన ప్రకటన చేశారు చంద్రబాబు. టీడీపీలో ముందే అభ్యర్థిని ప్రకటించే సాంప్రదాయం లేదు. ఎప్పుడైనా టికెట్ల విషయంలో చంద్రబాబు చివరి వరకు నాన్చుతారనే టాక్ ఉంది. అందుకు భిన్నంగా ఎన్నికలకు మరో రెండేళ్లకు పైగా సమయం ఉండగానే ఓ అభ్యర్థిని ప్రకటించారు చంద్రబాబు. బాదుదే బాడుదు కార్యక్రమంలో భాగంగా కర్నూల్ జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. డోన్ అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డి పేరును బహిరంగ సభలో అధికారికంగా ప్రకటించారు.

చంద్రబాబు డోన్ టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం కర్నూల్ జిల్లా టీడీపీలో సంచలనంగా మారింది. డోన్ అసెంబ్లీకి 1985 నుంచి కేఈ కృష్ణమూర్తి కుటుంబ సభ్యులే పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ కేఈ ప్రభాకర్ బరిలో నిలిచారు. కాని ఇప్పుడు అనుహ్యంగా చంద్రబాబు.. కేఈ ఫ్యామిలీ నుంచి కాకుండా సుబ్బారెడ్డి పేరు ప్రకటించడం అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు చంద్రబాబు పర్యనటలో కేఈ కుటుంబం నుంచి ఎవరూ పాల్గొనలేదు. చంద్రబాబు వైఖరిని ముందే పసిగట్టిన కేఈ సోదరులు... ఆయన కార్యక్రమానికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. కొన్ని రోజులుగా డోన్ లో కేఈ ప్రభాకర్, సుబ్బారెడ్డి మధ్య ఆదిపత్య పోరు సాగుతోంది. సుబ్బారెడ్డిని ఓపెన్ గానా టార్గెట్ చేశారు కేఈ ప్రభాకర్ అనుచరులు. ఇందుకు సంబంధించి కేఈ అనుచరులకు టీడీపీ నోటీసులు కూడా ఇచ్చింది. తాజాగా ఏకంగా డోన్ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డి పేరును ప్రకటించడం కేఈ వర్గీయులను షాక్ కు గురి చేసింది. చంద్రబాబు తీరుపై ఆగ్రహంగా ఉన్న కేఈ సోదరులు.. త్వరలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేయే యోచనలో కేఈ బ్రదర్స్ ఉన్నారని అంటున్నారు. అదే జరిగితే కర్నూల్ జిల్లాలో రాజకీయాల్లో పెను మార్పులు జరిగే అవకాశం ఉంది.

READ ALSO: Davos Meeting: దావోస్ భేటీకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏ అంశాలపై ఫోకస్ ?

READ ALSO: Dead Body In MLC Car: వైసీపీ ఎమ్మెల్సీ కారులో మృతదేహం కలకలం.. కొట్టి చంపారనే ఆరోపణలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News