CBI files first chargesheet in YS Vivekananda Reddy murder case: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి, యాదటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్ దస్తగిరి పాత్ర ఉందని సీబీఐ పేర్కొంది. ఆ నలుగురి ప్రమేయంపై తాజాగా పులివెందుల కోర్టులో (Pulivendula court) అభియోగపత్రం దాఖలు చేసింది. వీరిలో ఇప్పటికే ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి బెయిల్‌పై ఉన్నారు. ఇక ఈ హత్య కేసులో వీరి ప్రమేయానికి సంబంధించిన పలు అంశాలను, ఆరోపణలను, అభియోగపత్రంలో సీబీఐ వెల్లడించింది.
గజ్జల ఉమాశంకర్‌రెడ్డి (Gajjala Umashankar Reddy) అనే వ్యక్తి.. వివేకా వద్ద పీఏగా పనిచేసిన జగదీశ్వరరెడ్డి సోదరుడు ఉమాశంకర్‌రెడ్డి. ఈయనది కడప జిల్లా సుంకేశుల. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్‌ను వివేకాకు పరిచయం చేసింది ఈయనే. వివేకాను అంతమొందించేందుకు సునీల్‌తో (Sunil) కలిసి ప్రణాళిక రూపొందించారని సీబీఐ పేర్కొంది. అలాగే ఇంటి వద్ద ఉండే కుక్కను ఉమాశంకర్‌రెడ్డి కారుతో గుద్దించి చంపేశారని సీబీఐ వెల్లడించింది. వివేక హత్యలో (Vivekananda Reddy murder) శంకర్‌రెడ్డి ప్రమేయం ఉందంటూ సునీల్ యాదవ్, దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారని సీబీఐ పేర్కొంది.
ఇక యాదటి సునీల్ యాదవ్‌ది (Sunil Yadav) పులివెందుల మండలం మోట్నూంతలపల్లె. వివేకా హత్యకు కొన్ని రోజుల ముందే ఈయన.. ఆయనకు పరిచయమయ్యారు. సునీల్ ఉమాశంకర్‌రెడ్డితో కలిసి ప్రణాళిక రూపొందించారు. వివేకాను హత్య చేసిన రోజు రాత్రి ఆయన ఇంటికి చేరుకునేందుకు ఉమాశంకర్‌రెడ్డికి చెందిన బైక్‌నే సునీల్ వినియోగించారని తమ దర్యాప్తులో తేలిందని సీబీఐ (CBI) చెప్పింది. గొడ్డలిని బైక్ సైడ్ బ్యాగ్‌లో దాచిపెట్టి, దానిపైనే అక్కడి నుంచి తప్పించుకున్నారని సీబీఐ వెల్లడించింది.
Also Read : Telangana inter Spot valuation: తెలంగాణ ఇంటర్ స్పాట్ వ్యాల్యూయేషన్ తేదీలు
అలాగే తూమలపల్లి గంగిరెడ్డి అలియాస్ ఎర్ర గంగిరెడ్డి (Gangireddy) 40 ఏళ్లుగా వివేకాకు సన్నిహితుడు ఉండేవారు. సీబీఐ విచారణ కోరుతూ వివేకా కుమార్తె సునీత (Sunita) హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్న అనుమానితుల జాబితాలో ఈయన పేరు రెండోది.
అయితే వివేకా హత్య కేసు విషయంలో "ఎవరికైనా నా పేరు చెబితే నిన్ను నరికేస్తా" అంటూ ఎర్ర గంగిరెడ్డి తనను బెదిరించారంటూ వివేకా వద్ద వాచ్‌మన్‌గా పనిచేసిన రంగన్న (Ranganna) ఈ ఏడాది జులైలో ఆరోపించారు. ‘‘వివేకా హత్య తర్వాత ఘటనా స్థలంలోని రక్తపు మరకలు, ఇతర ఆధారాలన్నింటినీ తుడిచేశారు. మనోహర్‌రెడ్డి (Manohar Reddy) చెబితేనే ఆధారాల్ని తుడిచేశానని ఆయన గతంలో కస్టడీలో ఉన్నప్పుడు చెప్పారు. వివేకా మరణించారనే విషయం మా తల్లికి, నాకు కానీ ఫోన్ చేసి చెప్పలేదు.’’ అంటూ వివేకా కుమార్తె సునీత ఈయనపై అనుమానాలు వ్యక్తంచేశారు.
ఇక షేక్ దస్తగిరి.. వివేకా వద్ద 2017, 2018ల్లో డ్రైవర్‌గా పని చేశారు. ఈయనను రెండు నెలలపాటు సీబీఐ అధికారులు విచారించి హత్య కేసులో (Vivekananda Reddy murder) ఇతని పాత్ర ఉందని సీబీఐ (CBI) అభియోగపత్రంలో పేర్కొంది.
Also Read : Shirdi Sai Baba vachans: షిర్డీ సాయిబాబా అనుగ్రహం కోసం సాయి ఏకాదశ సూత్రములు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook