ఢిల్లీ: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపి ఎంపీ జీవీఎల్ నర్సింహా రావు ( BJP MP GVL Narasimha Rao ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) హయాంలో రాష్ట్రంలోని అనేక దేవాలయాలను కూల్చేశారని, కృష్ణా పుష్కరాల సమయంలో చంద్రబాబు తీరు వల్లే అనేక మంది ప్రాణాలు కోల్పోయారని జీవీఎల్ విరుచుకుపడ్డారు. అలాంటిది ఇప్పుడు అంతర్వేది రథం దగ్ధం ( Antarvedi chariot fire ) విషయంలో చంద్రబాబు హిందూ ఉద్ధారకుడిలా ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదం అని జీవీఎల్ ఎద్దేవా చేశారు. శుక్రవారం జీవీఎల్ నర్సింహా రావు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. Also read : Antarvedi: చలో అంతర్వేదికి అనుమతుల్లేవు..ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఈ సందర్భంగా అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం ( Antarvedi radham issue ) ఘటనపై జీవీఎల్ మాట్లాడుతూ.. అంతర్వేది ఘటనతో పాటు ఇతర హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, అమరావతిలపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల నిరోధించాల్సిందిగా కోరుకూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశామని తెలిపారు. చర్చిపై రాళ్ళు వేశారనే ఆరోపణలతో అరెస్టు చేసిన 41 మందిని తక్షణమే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. Also read : Krishna River: కృష్ణానదిపై మరో రెండు బ్యారేజ్ లకు గ్రీన్ సిగ్నల్