AP Skill Development Scam: నైపుణ్యాభివృద్ధి కుంభకోణం కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది. కుంభకోణం ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సైమన్స్ కంపెనీకి సంబంధించిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఈ కేసును విచారణ చేస్తున్న ఈడీ మళ్లీ దూకుడు పెంచడం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. అధికారంలో ఉన్న సమయంలోనే చంద్రబాబుకు సంబంధించిన కేసులో ఈడీ దూకుడుగా వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Ticket Price: సినిమా టికెట్ ధరలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన
నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్‌లో ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. నైపుణ్యాభివృద్ధి సంస్థలో కుంభకోణం జరిగిందని కేసు నమోదై సీఐడీ, ఈడీ కేసులు నమోదు చేసింది. ఇదే కేసులో నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నేటి సీఎం చంద్రబాబు అరెస్టయ్యారు. అయితే రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారడంతో ఈ కేసు మరుగున పడిందని అందరూ భావించారు. అనూహ్యంగా మళ్లీ ఈడీ ఆస్తుల అటాచ్‌తో తెరపైకి వచ్చింది.
Also Read: Gudivada Amarnath: ఏపీ మద్యం టెండర్లలో భారీ కుంభకోణం.. సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు
తాజాగా ఈడీ హైదరాబాద్ బ్రాంచ్ అధికారులు సిమెన్స్ కంపెనీకి సంబంధించిన రూ.23.54 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఈ కుంభకోణం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సైమన్స్ కంపెనీకి చెందిన ఢిల్లీ, ముంబై, పుణెలలో రూ.23 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ ప్రకటించింది. నకిలీ ఇన్ వాయిస్‌ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసినట్లు ఈడీ నిర్ధారణ చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు తేలింది. దీంతో ఆ సంస్థ ఎండీ వికాస్ వినాయక్ ఖాన్వేల్కర్, సుమన్ బోస్, ముకుల్ చంద్‌ల ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. కాగా ఇదే కేసులో సీఎం చంద్రబాబు బెయిల్‌పై బయట ఉన్న విషయం తెలిసిందే.
ఈడీ దూకుడుతో కలకలం
ఎన్నికలు ముగిసిన నాలుగు నెలల తర్వాత ఈడీ దూకుడు పెంచడం కలకలం రేపుతోంది. వాస్తవంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయారు. జగన్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడం జైలుకు వెళ్లిన చంద్రబాబు సీఎం కావడంతో నైపుణ్య అభివృద్ధి కేసు మరుగున పడిందని అందరూ భావించారు. ఈ క్రమంలో అనూహ్యంగా ఈడీ ఆస్తులు అటాచ్ చేయడం కలకలం రేపుతోంది. ఈడీ దూకుడుగా వెళ్తే భవిష్యత్‌లో చంద్రబాబుకు ఇబ్బందులు ఎదురవుతాయా అనే చర్చ జరుగుతోంది.
ED, Hyderabad has provisionally attached immovable and movable properties amounting to Rs. 23.54 Crore under the provisions of the PMLA, 2002 in a case relating to misuse of funds in the Andhra Pradesh State Skill Development Corporation (APSSDC) Siemens Project. The said project…
— ED (@dir_ed) October 15, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter