Balakrishna as Padma Bhushan: మొత్తం 19 మందికి ఈ సారి పద్మభూషణ్ ప్రకటించారు. ఇందులో కళల విభాగంలో బాలకృష్ణకు ఈ పురస్కారం దక్కింది. మరోవైపు ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డును కేంద్రం ప్రకటించింది. ప్రముఖ వైద్యులు నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్ , విద్యా సాహిత్యంలో కేఎల్ కృష్ణకు పద్మశ్రీ, సాహిత్యంలో మాడుగుల నాగఫాణిశర్మకు పద్మశ్రీ దక్కింది. ఈ నేపథ్యంలో ప్రముఖులు పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేసారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాలయ్యతో పాటు పద్మ అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలియజేసారు. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బాలకృష్ణతో పాటు మంద కృష్ణ మాదిగతో పాటు నాగఫణి శర్మ సహా పలువురికి అభినందలు తెలియజేసారు.
Heartfelt congratulations to Telugu cinema legend and Hindupur MLA, Shri Nandamuri Balakrishna Garu, on being conferred the Padma Bhushan! Upholding the legendary NTR Garu’s legacy, you have excelled in cinema, politics, and philanthropy. Your dedication to public welfare,… pic.twitter.com/rC4HEABLmN
— N Chandrababu Naidu (@ncbn) January 25, 2025
Heartiest Congratulations on the conferment of prestigious Padma Vibhushan to Dr.D Nageswara Reddy garu for his illustrious services and Padma Bhushan award to dear friends #NandamuriBalakrishna, #AjithKumar, Sri Anant Nag , Sekhar Kapur Ji ,
my co star in Rudraveena #Sobhana…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 25, 2025
Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.
— Jr NTR (@tarak9999) January 25, 2025
Many congratulations to Balayya on the prestigious Padma Bhushan!! A well- deserved honour for your monumental impact on cinema and your dedication to public service! ❤️🤗✨ pic.twitter.com/y2Ps18lv8H
— Venkatesh Daggubati (@VenkyMama) January 25, 2025
Heartfelt congratulations to my Babai Nandamuri Balakrishna garu on receiving the prestigious Padma Bhushan award. This honor is a true recognition of your exceptional contributions to the world of cinema and your relentless efforts in serving society.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) January 25, 2025
A heartfelt congratulations to Balakrishna garu on being honored with the Padma Bhushan! 👏🏻👏🏻👏🏻 This well-deserved recognition celebrates his unwavering passion and dedication to cinema and art. Truly an inspiration!
— Mahesh Babu (@urstrulyMahesh) January 25, 2025
7 Padma Awards for Telugu people this time… 👏🏻👏🏻👏🏻👏🏻
Heartiest congratulations to Nandamuri Balakrishna garu on being honored with the Padma Bhushan! Your journey in Indian cinema is truly commendable…
Also, congratulations to all the other distinguished Telugu & other…
— rajamouli ss (@ssrajamouli) January 25, 2025
Congratulations to all the Padma awardees! India is proud to honour and celebrate their extraordinary achievements. Their dedication and perseverance are truly motivating. Each awardee is synonymous with hardwork, passion and innovation, which has positively impacted countless…
— Narendra Modi (@narendramodi) January 25, 2025
అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేసారు. అయిదు దశాబ్దాలపైబడి తెలుగు చలనచిత్ర సీమలో తన అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన బాలకృష్ణ - హిందూపురం శాసన సభ్యుడిగా, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ గా ఎన్నో సేవలందిస్తున్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నట్టు ఓ లేఖ విడుదల చేశారు. ప్రముఖ వైద్యులు, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో పలు పరిశోధనలు చేసిన డా.డి.నాగేశ్వర్ రెడ్డి పద్మ విభూషణ్ కు ఎంపికైనందుకు అభినందనలు తెలిపారు.
ప్రజా ఉద్యమాల్లో శ్రీ మంద కృష్ణ మాదిగ గారికి ప్రత్యేక స్థానం ఉంది. ఎం.ఆర్.పి.ఎస్. ద్వారా మాదిగలకు రిజర్వేషన్ కోసం పోరాడారు. అనారోగ్యంతో బాధపడే పిల్లలకు ప్రభుత్వ వైద్య సహాయం కోసం, వికలాంగుల కోసం ప్రజా పోరాటాలు చేశారు. మంద కృష్ణ మాదిగ పద్మశ్రీ కు ఎంపికైనందుకు అభినందనలు తెలిపారు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సహస్రావధాని, కవి శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు, సాహిత్యం-విద్య విభాగంలో ఎంపికైన శ్రీ కె.ఎల్.కృష్ణ , శ్రీ వి.రాఘవేంద్రాచార్య పంచముఖి గార్లకు అభినందనలు తెలిపారు.
మట్టిలో మాణిక్యాలాంటి వారికి పద్మ పురస్కారాలు అందిస్తోంది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది 30మంది ఈ విధంగా ఎంపికైనవారు ఉండటం సంతోషాన్ని కలిగించిందన్నారు. మన రాష్ట్రానికి చెందిన బుర్రకథ కళాకారుడు శ్రీ మిరియాల అప్పారావు గారికి మరణానంతరం పద్మశ్రీకి ఎంపికయ్యారు. వారి కళా సేవకు తగిన గుర్తింపు దక్కిందన్నారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
అటు మెగాస్టార్ చిరంజీవి బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేసారు. అటు బాలయ్య సమకాలీనుడైన వెంకటేష్ తన తోటి నటుడికి అభినందనలు తెలియజేసారు. అటు బాలయ్య అన్నకుమారులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, రవితేజతో పాటు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి హరీష్ రావు సహా సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.