AP Summer Holidays: ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులకు ఇది శుభవార్త. రాష్ట్రంలో విద్యాసంస్థలకు మే 9 నుంచి సెలవులుంటాయని ఏపీ విద్యాశాఖ వెల్లడించింది. ఆ వివరాలు ఇలా..
వేసవి కాలం కావడంతో ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. ఇంకోవైపు పరీక్షల సమయం. ఓ వైపు పదవ తరగతి, మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షలు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అందించింది. మే 9 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ విద్యార్ధులకు ఏప్రిల్ 22 నుంచి మే 4 వరకూ సమ్మెటివ్ 2 పరీక్షలు జరగనున్నాయి. చిన్నారులకు అంటే 9వ తరగతి వరకూ ఉన్న విద్యార్ధులకు మే 4వ తేదీన పరీక్షలు పూర్తి కాగానే..సెలవులు ఇవ్వనున్నారు. అటు పదవ తరగతికి మాత్రం మే 9వ తేదీన చివరి పరీక్ష నుంచి ఇక సెలవులే. ఇక ఇంటర్నీడియట్ విద్యార్ధులకు మాత్రం అందరికంటే ఆలస్యంగా మే 25 నుంచి జూన్ 20 వరకూ సెలవులు ఇవ్వనుంది ప్రభుత్వం. ఇంకా ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాలేదు. మే 7 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Also read: Prakasam: కూల్ డ్రింక్‌లో మత్తు మందు.. బాలికను వివస్త్రను చేసి... సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook