AP Corona Update: ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా సంక్రమణ, తూర్పు గోదావరిలో అత్యధిక కేసులు

AP Corona Update: ఏపీలో కరోనా వైరస్ సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. కరోనా సంక్రమణ పెరగకుండా ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 19, 2021, 03:49 PM IST
  • ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా సంక్రమణ
  • గత 24 గంటల్లో 55 వేల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు
  • గత 24 గంటల్లో కొత్తగా 1174 కొత్త కరోనా కేసులు
 AP Corona Update: ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా సంక్రమణ, తూర్పు గోదావరిలో అత్యధిక కేసులు

AP Corona Update: ఏపీలో కరోనా వైరస్ సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. కరోనా సంక్రమణ పెరగకుండా ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) సృష్టించిన విపత్కర పరిస్థితుల్నించి ఏపీ బయటపడినా..కేసుల సంఖ్య ఇంకా స్థిరంగానే కొనసాగుతోంది. గత 24 గంటల్లో ఏపీలో 55 వేల 525 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..1174 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 14 వేల 653 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. అటు తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 208 కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 159 నెల్లూరులో 122, కృష్ణా జిల్లాలో 140 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 9 మంది కరోనా కారణంగా మరణించగా..ఇప్పటి వరకూ ఆ సంక్య 14 వేల 61కు చేరుకుంది. గత 24 గంటల్లో 1309 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 20 లక్షల 34 వేల 458 కోవిడ్ కేసులు నమోదు కాగా, 20 లక్షల 5 వేల 744 మంది కోలుకున్నారు. ఏపీలో కరోనా సంక్రమణను నియంత్రించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరోనా నియంత్రణకై నైట్‌కర్ఫ్యూని సెప్టెంబర్ 30 వరకూ పొడిగించారు. మరోవైపు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించకపోయినా, నిబంధనల్ని ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. 

Also read: Night Curfew: కరోనా నియంత్రణకై నైట్‌కర్ఫ్యూ పొడిగింపు, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News