BVS Ravi tweets on PRC: ఏపీ పీర్సీపై బీవీఎస్ రవి స్పందన, ప్రజలు పతనం పరిచయం చేస్తారంటూ ట్వీట్‌!

BVS Ravi comments on AP Government: ఏపీలో పీర్సీ జీవోలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్న ఉద్యోగులకు ఇప్పుడు పలు రంగాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే తెలుగు ఫిల్మ్‌ మేకర్ బీవీఎస్ రవి ఒక ట్వీట్‌ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2022, 01:27 PM IST
  • ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పీఆర్సీపై రగడ
  • ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన పీఆర్సీ జీఓలకు వ్యతిరేకంగా నిరసనలు
  • చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్
  • ఉద్యోగులకు మద్దతు తెలుపుతూ ఫిల్మ్‌ మేకర్ బీవీఎస్ రవి ట్వీట్
  • గతంలో కూడా ఇలాంటి పలు ట్వీట్స్‌ చేసిన బీవీఎస్ రవి
BVS Ravi tweets on PRC: ఏపీ పీర్సీపై బీవీఎస్ రవి స్పందన, ప్రజలు పతనం పరిచయం చేస్తారంటూ ట్వీట్‌!

Film Maker BVS Ravi tweet: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పీఆర్సీపై రగడ కొనసాగుతోంది. ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన పీఆర్సీ జీఓలకు వ్యతిరేకంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహిస్తున్నారు. పీఆర్సీ (PRC) సాధన సమితి పిలుపుతో తాజాగా చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఉద్యోగులు (Employees) సక్సెస్ చేసుకున్నారు. 

ఏపీలోని అన్ని జిల్లాల్లో పోలీసులు (Police) ఉద్యోగుల్ని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నించినా కూడా వారంతా విజయవాడకు చేరుకుని చలో విజయవాడను విజయవతం చేశారు. ఏపీ (AP) నలుమూలల నుండి వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులతో విజయవాడలోని రోడ్లన్నీ కదనరంగంలా తలపించాయి. బీఆర్‌టీఎస్‌ రోడ్‌ (BRTS Road) మొత్తం నినాదాలతో మారుమోగిపోయింది. 

ఇక ఉద్యోగుల నిరసనలకు, ఆందోళనలకు ఇప్పుడు అంతటా మద్దతు లభిస్తోంది. పలు రంగాలకు చెందిన వారు ఉద్యోగులకు మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలో ఫిల్మ్‌ మేకర్ బీవీఎస్ రవి (BVS Ravi) కూడా తాజాగా ఈ విషయంపై స్పందించారు. అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలుపెడితే ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతేకాదు అలా ప్రవర్తిస్తే ప్రజలు పతనం పరిచయం చేస్తారని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్నితరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోందంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

ఫిల్మ్‌ మేకర్ బీవీఎస్ రవి గతంలో కూడా ఏపీ ప్రభుత్వంపై పలు సందర్భాల్లో తన అభిప్రాయాన్ని తెలిపారు. సినిమా టిక్కెట్ల రేట్ల (Movie Ticket Rates) సమస్యపై కూడా గతంలో ఆయన ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. "వోల్వో బస్సు టికెట్‌కి.. పల్లె వెలుగు బస్సుల టికెట్‌కి ఒకటే రేటు పెట్టి మిగతా వ్యాపారాలకి కూడా ప్రభుత్వం ఆదర్శంగా నిలవాలని మనవి చేస్తున్నా." అంటూ గతంలో ఒక సెటైరికల్‌ ట్వీట్ కూడా చేశాడు బీవీఎస్ రవి.

ఇక ఇప్పుడు తాజాగా పీఆర్సీ విషయంలో ఆయన స్పందించారు. పీఆర్సీకి (PRC) వ్యతిరేకంగా పోరాడుతోన్న ఉద్యోగులకు (Employees) మద్దతుగా ఆయన ట్వీట్ చేశారు.

Also Read: Numerology Predictions: ఏయే తేదీల్లో పుట్టినవారికి ఇవాళ కలిసొస్తుంది..

Also Read: NEET PG Exam Postponed: నీట్ విద్యార్ధులకు శుభవార్త, 6-8 వారాల వరకు పీజీ పరీక్ష వాయిదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News