AP Panchayat Elections 2021 Live Updates: ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పంచాయతీ ఎన్నికల్లో విషాదం చోటుటచేసుకుంది. గుంటూరు జిల్లాలో గుండెపోటుతో పోలింగ్ ఏజెంట్ మృతిచెందాడు. కాకుమాను మండలంలో పోలింగ్ ఏజెంట్‌గ్ విధులు నిర్వహిస్తున్న మస్తాన్ వలీకి గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు.
ఏపీలో తొలి దశ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 12 జిల్లాల్లోని 2 వేల 724 గ్రామ పంచాయితీల్లో 29,732 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికలను పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది (Gopalakrishna Dwivedi) పర్యవేక్షిస్తున్నారు. ఇదివరకే 525 పంచాయితీలు ఏకగ్రీవం కాగా, మిగతా పంచాయతీ ఎన్నికల్లో కోవిడ్19 నిబంధనలతో ఓటింగ్ నిర్వహిస్తున్నారు.
Also Read: EPFO: జాబ్ మానేసిన ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్, ఇకనుంచి పాత కంపెనీతో పనిలేదు
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో(AP Panchayat Elections 2021) ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ విప్, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలీసుశాఖ సహకారంతో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. అయినా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.
Also Read: AP Panchayat Elections 2021: పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై AP SEC చర్యలు, నివేదిక కోసం ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook