AP High Court: కృష్ణపట్నం కరోనా మందుపై రేపు హైకోర్టులో విచారణ

AP High Court: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కృష్ణపట్నం ఆనందయ్య మందు వ్యవహారం న్యాయస్థానానికి చేరింది. కోవిడ్ మందు పంపిణీ సజావుగా సాగేలా ఆదేశించాలంటూ ఏపీ హైకోర్టుకు పిటీషన్లు చేరాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 26, 2021, 09:43 AM IST
AP High Court: కృష్ణపట్నం కరోనా మందుపై రేపు హైకోర్టులో విచారణ

AP High Court: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కృష్ణపట్నం ఆనందయ్య మందు వ్యవహారం న్యాయస్థానానికి చేరింది. కోవిడ్ మందు పంపిణీ సజావుగా సాగేలా ఆదేశించాలంటూ ఏపీ హైకోర్టుకు పిటీషన్లు చేరాయి.

ఏపీ కృష్ణపట్నం కరోనా మందు(Krishnapatnam Corona Medicine)పైనే ఇప్పుడందరి దృష్టీ నెలకొంది. ఆనందయ్య ఇస్తున్న మందుపై ఇప్పుడు అధ్యయనం జరుగుతోంది. మరోవారంలో రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తరువాతే ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. మరోవైపు ఈ మందుపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు టీటీడీ ఆయుర్వేద కళాశాల సిద్ధమైంది. ఇదిలా ఉంటే ఆనందయ్య మందు వ్యవహారం పంచాయితీ న్యాయస్థానానికి చేరింది. కోవిడ్ మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారుల్ని ఆదేశించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. మరోవైపు ఆనందయ్య మందును ఆయుర్వేద మందుగా గుర్తించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆదేశించాలని మరో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్లను అత్యవసరంగా విచారణ జరపాలని పిటీషనర్లు కోరడంతో హైకోర్టు(Ap High Court) రేపు విచారించనుంది. 

ఆయుష్ పూర్తిస్థాయి నివేదిక, ఐసీఎంఆర్ నివేదిక అనుకూలంగా వస్తే పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం (Ap government)ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసింది. అవసరమైతే ఆ మందును తయారు చేసి పంపిణీ చేసేందుకు టీటీడీ ( TTD) ఆయుర్వేద కళాశాల ముందుకొచ్చింది. 

Also read: ఏపీలో 252 Black fungus cases నమోదు.. అందుబాటులోకి Injections

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News