AP Corona Cases Today: ఏపీలో మళ్లీ పెరిగిన కొవిడ్ ఉద్ధృతి.. 15 వేలకు చేరువలో కరోనా కేసులు

AP Corona Cases Today: ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,502 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే కరోనా ధాటికి మరో ఏడుగురు మరణించినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2022, 06:10 PM IST
    • ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
    • కొత్తగా 14,502 మందికి కరోనా నిర్ధారణ
    • కరోనా ధాటికి మరో ఏడుగురు మృతి
AP Corona Cases Today: ఏపీలో మళ్లీ పెరిగిన కొవిడ్ ఉద్ధృతి.. 15 వేలకు చేరువలో కరోనా కేసులు

AP Corona Cases Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 14,502 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా, గడిచిన 24 గంటల్లో 40,266 నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 

కొవిడ్ ధాటికి 7 మంది మరణించారు. పశ్చిమగోదావరిలో ఇద్దరు మృతి చెందగా, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారని ట్విట్టర్ లో ప్రకటించారు. 

ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4,800 మంది కొవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 2,99,92,161 మంది కరోనాను జయించారు. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం 93,305 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. 

జిల్లాల వారిగా కేసులు

అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 1728 కొవిడ్ కేసులు, అనంతపురంలో 1610, ప్రకాశం జిల్లాలో 1597, కర్నూలులో 1551, కడపలో 1492, నెల్లూరులో 1198 కేసులు నమోదయ్యాయి. కరోనాతో పోరాడుతూ ఇప్పటివరకూ 14,549 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 93,305 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. 

Also Read: Undavilli Arun Kumar: ఇప్పుడున్న పరిస్థితుల్లో సమ్మె వద్దని చెబుతున్న మాజీ ఎంపీ ఉండవల్లి

Also Read: AP High Court: పీఆర్సీని సవాలు చేసే హక్కు ఉద్యోగులకు లేదని స్పష్టం చేసిన హైకోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News