AP Cabinet Decisions: ఏపీ కేబినెట్‌లో సంచలన నిర్ణయాలు, సీపీఎస్ రద్దు, పీఆర్సీ ఏర్పాటుకు ఆమోదం, ముందస్తుకు నో

AP Cabinet Decisions: అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఉద్యోగుల సమస్యకు తెరపడేలా నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మొత్తం 63 అంశాలను ఏపీ కేబినెట్ ఆమోదించింది. ముందస్తు ఊహాగానాలకు తెరదించేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 7, 2023, 04:46 PM IST
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్‌లో సంచలన నిర్ణయాలు, సీపీఎస్ రద్దు, పీఆర్సీ ఏర్పాటుకు ఆమోదం, ముందస్తుకు నో

AP Cabinet Decisions: గత కొద్దికాలంగా రాష్ట్రంలో ముందస్తు ఊహాగానాలు పెరిగిపోయాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఊహాగానాలకు తెరదించేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయని తేల్చి చెప్పేశారు. దీర్ఘకాలంగా ఉన్న ఉద్యోగ సమస్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. 

ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న ఉద్యోగుల సమస్య, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాలు, ముందస్తు ఎన్నికలు అన్నింటికీ సమాధానం లభించింది. ముందస్తు ఎన్నికలపై ఇవాళ్టి కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటారనే వార్తలు కూడా వ్యాపించాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టత ఇచ్చారు. ముందస్తకు ఉండదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళతామని తేల్చి చెప్పారు. అంతేకాకుండా కష్టపడి పనిచేస్తే మరోసారి అధికారం తమదేనని మంత్రులకు సూచించారు. ముందస్తు ఎన్నికల విషయంలో కొందరు మంత్రులు ప్రస్తావించగా సీఎం జగన్ లేదని కరాఖండీగా చెప్పేశారు. కేబినెట్ సమావేశం అనంతరం ఈ విషయాల్ని మంత్రులతో ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 

ఇక కేబినెట్ సమావేశం విషయానికొస్తే 63 కీలకాంశాలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదముద్ర వేశారు. చాలాకాలంగా రాష్ట్రంలో పెండింగులో ఉన్న పలు సమస్యలకు కేబినెట్‌లో ఆమోదం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సీపీఎస్ రద్దు చేసి ఆ స్థానంలో జీపీఎస్ అమలుకు కేబినెట్ ఆమోదించింది. అదే విధంగా ఎన్నికల హామీల్లో భాగమైన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 

సీపీఎస్ రద్దు, జీపీఎస్ పేరుతో కొత్త బిల్లు

సీపీఎస్ రద్దు అనేది కూడా ఎన్నికల హామీల్లో ఒకటి. సీపీఎస్ స్థానంలో కొత్తగా జీపీఎస్ బిల్లు తీసుకొస్తోంది. ఇవాళ కేబినెట్ ఆమోదించడంతో త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. జీపీఎస్ అంటే గ్యారెంటెడ్ పెన్షన్ బిల్ 2023. దీని ప్రకారం ఉద్యోగ విరమణ తరువాత వచ్చే 50 శాతం పెన్షన్‌కు తగ్గకుండా డీఏ క్రమంగా పెరిగేలా కొత్త బిల్లు రూపకల్పన జరిగింది. 

మరోవైపు  2014 జూన్ నుంచి పనిచేస్తున్న రాష్ట్రంలోని దాదాపు 10 వేలమంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించేందుకు ఏపీ కేబినెట్ ఆమోదించింది. వీటితో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమ్మ ఒడి పథకం, జగనన్న ఆణిముత్యాలు, విద్యాకానుక పంపిణీ, కొత్త డీఏ అమలుకు కేబినెట్ ఆమోదించింది. దీంతో పాటు కొత్త పీఆర్సీ 12వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. కొత్తగా వివిధ శాఖల్లో 6,840 పోస్టులకు ఆమోదం లభించింది. ఇందులో పోలీసు శాఖకు సంబంధించి 3,920 పోస్టులు ఉంటే..కొత్త మెడికల్ కళాశాలల్లో 2,118 ఉన్నాయి.

గ్రూప్ 1, 2, పోస్టుల నియామకాలకు, 476 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నైట్ వాచ్‌మెన్ పోస్టులకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో ఎంవోయూలు కుదుర్చుకున్న సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఓకే చెప్పింది.

Also read: AP Elections: ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు ముందస్తుకు సంకేతాలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News