అక్టోబర్ 2 నుంచి నిరుద్యోగ భృతి: సీఎం చంద్రబాబు

అక్టోబర్ 2 నుంచి నిరుద్యోగ భృతి: సీఎం చంద్రబాబు

Last Updated : Sep 5, 2018, 08:35 PM IST
అక్టోబర్ 2 నుంచి నిరుద్యోగ భృతి: సీఎం చంద్రబాబు

అక్టోబర్ 2వతేదీ నుంచి నిరుద్యోగ భృతి అమలు చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పేరుతో నిరుద్యోగ భృతి పథకం అమలు చేస్తామన్నారు. ఈ నెలలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని.. అక్టోబర్ 2న డబ్బులు పంపిణీ చేస్తామని అన్నారు.

కేంద్ర సహకారం లేనప్పటికీ.. ప్రతి ఏడాది  ఏపీ రెండంకెల వృద్ధి సాధిస్తోందని చంద్రబాబు అన్నారు. దేశంలో 8 శాతం వృద్ధి రేటు ఉంటే.. ఏపీ 11.25 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోందనన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 13లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామన్న ఆయన.. 30 లక్షల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేసిన ఏకైక రాష్ట్రం ఏపీనేనన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 300 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయిలో చంద్రబాబు తొలుత ఎన్టీఆర్‌, హరికృష్ణ చిత్రపటాలకు నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి కళా వెంకట్రావు నందమూరి హరికృష్ణ మృతిపై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

Trending News