కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజృంభిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా ఏపీలో మాత్రం ఇందుకు భిన్నంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 7727 శాంపిల్స్ సేకరించి పరీక్షించగా 73 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. భారత్‌లో నిన్న ఒక్కరోజే 73 మంది మృతి
రాష్ట్రంలో నమోదైన మొత్తం 1332 పాజిటివ్ కేసులకుగాను చికిత్స అనంతరం 287 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1014. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ వివరాలను వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ఉదయం ఏపీ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. బంగారం ధరలు పైపైకి.. పతనమైన వెండి ధరలు
Photos: పెళ్లి తర్వాత నటి గ్లామర్ షో!
జిల్లాలవారీగా చూస్తే 343 కరోనా పాజిటివ్ కేసులతో కర్నూలులో కరోనా తీవ్రత అధికంగా ఉంది. గుంటూరు 283, కృష్ణా 236 కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తాజా కేసులతో ఒక్క గుంటూరు జిల్లాలోనే 29 కేసులు నమోదు కావడం గమనార్హం. శ్రీకాకుళం జిల్లాలో మరో కేసు నమోదు కావడంతో అక్కడ మొత్తం కేసులు 5గా ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని మంగళవారం 29 మంది ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారని బులెటిన్‌లో తెలిపారు.. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..