Poll Strategy Survey On AP Elections 2024: ఏపీ ఎన్నికలపై మరో సంచలన సర్వే.. అధికారం ఆ పార్టీ దే ..?

Who Will Win in AP Assembly Elections: ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఒకేసారి జమిలి ఎన్నికల జరుగుతున్నాయి. వచ్చే నెల 13న జరిగే పోలింగ్‌లో ఓటర్లు తమ తీర్పు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారం ఆ పార్టీదే అంటూ మరో సంచలన సర్వే బయటకు వచ్చింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 15, 2024, 10:17 AM IST
Poll Strategy Survey On AP Elections 2024: ఏపీ ఎన్నికలపై మరో సంచలన సర్వే.. అధికారం ఆ పార్టీ దే ..?

AP Assembly Elections Latest Survey: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మూడోసారి అధికార పీఠం దక్కించుకోవడం దాదాపు ఖాయమని మెజారిటీ సర్వే సంస్థలు ఘోషిస్తున్నాయి. అంతేకాదు పశ్చిమ బంగతో పాటు తెలంగాణ, ఒడిషా రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలలో బీజేపీ మంచి ఫలితాలనే సాధిస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైయస్‌ఆర్సీపీ ఒకవైపు.. బీజేపీ, తెలుగు దేశం, జనసేన పార్టీలు మరోవైపు ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా బీజేపీ పెద్దన్న పాత్ర వహిస్తే.. ఏపీలో మాత్రం తెలుగు దేశం పెద్దన్న పాత్ర పోషిస్తుంది.

ఏపీలో రాజకీయాలు కొత్త కోణం వైపు తిరిగిందని చెప్పవచ్చు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ పై రాయి దాడి ఘటనపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. సానుభూతి కోసమే జగన్ తనపై దాడి చేయించుకున్నారని టీడీపీ, జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జగన్ పై దాడిని ఖండించారు. తాజాగా విడుదల చేసిన పోల్ స్ట్రాటజీ సర్వేలో  కూటమిలో ఓట్ల బదలాయింపు జరగడం కష్టమే అని తన సర్వేలో పేర్కొంది. టీడీపీ, బీజేపీ, జనసేనపై స్థాయిలో పొత్తు పెట్టుకున్న కింద స్థాయిలో మాత్రం కార్యకర్తలు మాత్రం ఇంకా కలవలేదనే చెప్పాలి. వీరి అధినాయకులు రాబోయే రోజుల్లో ఓట్ల బదలాయింపు అంశంపై దృష్టి పెట్టకపోతే.. కూటమి కొంప మునగడం గ్యారంటీ అంటూ ఈ సర్వే చెబుతోంది.

ముఖ్యంగా వైయస్ఆర్సీపీకి వాలంటీర్ వ్యవస్థ పెద్ద బలమనే చెప్పాలి. ముందు నుంచి ఈ సిస్టమ్ పై చంద్రబాబు, పవన్ లు పలు యూటర్న్ తీసుకున్నట్టు ఈ సర్వే చెబుతుంది. అది వారిపై ప్రజల్లో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ పడేలా చేసిందనే విమర్శలు వస్తున్నాయి. సంక్షేమ పథకాల కారణంగా బీసీ కులాల్లో వైసీపీ బలంగా వెళ్లిందనే ఈ సర్వే ఘోషిస్తుంది. గోదావరి జిల్లాల్లో వైయస్ఆర్సీపీ 16 నుంచి 20 స్థానాలతో పాటు 3 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ పుంజుకుందని చెబుతున్నారు. ఈ సర్వేలో లక్షా 25 వేల శాంపుల్స్ తీసుకుందని చెబుతున్నారు. ఈ సర్వేల ఏప్రిల్ 10 వరకు చేసిన సర్వే అని చెబుతున్నారు.  ఈ సారి ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ 50 నుంచి 52 శాతం ఓట్ షేర్ వస్తుందని చెబుతున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి 44 నుంచి 46 శాతం ఓట్ షేర్ వస్తుందని చెబుతున్నారు. ఇతరులకు 3.5 శాతం వస్తుందని చెబుతున్నారు.

ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే.. ఏపీలో ఓట్ షేర్ సీట్లుగా మారితే.. వైసీపీకి 120 నుంచి 130 సీట్లు గెలుచుకుంటుందని.. టీడీపీ కూటమి.. 45 నుంచి 55 సీట్లు గెలుచుకుంటుందని చెబుతున్నారు. లోక్ సభ సీట్ల విషయానికొస్తే.. వైఎస్సార్సీపీ దాదాపు 19-21 సీట్లు.. టీడీపీ అలయెన్స్.. 4-6 సీట్లు గెలుస్తుందని చెప్పారు. మరి ఎన్నికలకు మరో నెలరోజుల సమయం ఉంది. మరోవైపు ప్రధాని సభలు, రోడ్ షోలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల తేది వరకు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా.. ఇవే ఫలితాలు ఎన్నికల్లో ప్రతిఫలిస్తాయా అనేది చూడాలి.

Also Read: Revanth Reddy Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌ సంచలనం.. రేవంత్‌ రెడ్డికి బీజేపీకిలోకి ఆహ్వానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News