WhatsApp Governance: ఏపీలోని కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా కొత్త సౌలభ్యాలు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. టెక్నాలజీతో ప్రజలకు చేరువయ్యేందుకు చూస్తోంది. ఇందులో భాగంగానే గతంలో ప్రకటించిన వాట్సప్ పరిపాలనకు సిద్ధమైంది. కొన్ని ప్రత్యేకమైన సేవల్ని వాట్సప్ ద్వారా అందించనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై వాట్సప్ ద్వారా కొన్ని రకాల సేవలు అందనున్నాయి. తొలిదశలో వాట్సప్ ద్వారా జనన, మరణ ధృవీకరణ పత్రాలు అందించనుంది. పైలట్ ప్రాజెక్టుగా తెనాలి నుంచి ప్రారంభించి ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో టెక్నాలజీ వినియోగించుకుని పాలన అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అధికారుల్ని కోరారు. ఇందులో భాగంగా వాట్సప్ గవర్నెన్స్ ప్రారంభించనున్నారు. దీనికోసం అధికారులకు బాధ్యతల్ని కూడా అప్పగించారు. ముందుగా ప్రతి శాఖ నుంచి సమాచారం సేకరించాల్సి ఉంటుంది. ఆ తరువాత సమాచారాన్ని సమీకృతం చేసిన వాట్సప్ పాలన అందించాలి.
రాష్ట్రంలో త్వరలో వాట్సప్ ద్వారా 150 రకాల సేవలు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ముందుగా జనన, మరణ ధృవీకరణ పత్రాలు అందిస్తారు. ఆ తరువాత ఒక్కో శాఖను ఈ పరిధిలో తీసుకొస్తారు. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసుల్లో అంతా పేపర్ లెస్ వర్క్ జరుగుతోంది. ప్రభుత్వ పధకాల అమలుకు కీలకమైన ఆధార్ సేవల్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.
తెనాలిలో పైలట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించి ఆ తరువాత సాంకేతికంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని పరిశీలించనున్నారు. అన్నీ సవ్యంగా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది.
Also read: TG DSC 2025 Notification: నిరుద్యోగులకు శుభవార్త, త్వరలో 6 వేల పోస్టులతో మరో డీఎస్సీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి