AP Election Arrangements: ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మే 13 వ తేదీన జరగనున్న పోలింగ్‌కు అటు రాజకీయ పార్టీలు ఇటు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈవీఎంలలో తీర్పు నమోదు చేసేందుకు ఓటర్లు సిద్ధమౌతున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు జాగ్రత్తలు తీసుకుంది
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4 కోట్ల 14 లక్షల 1887 మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 2 కోట్ల 10 లక్షల 58 వేల 615 మంది ఉంటే పురుషులు 2 కోట్ల 3 లక్షల 39 వేల మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 5,26,010 మంది పోలింగ్ విధులు నిర్వహించనున్నారు. మొత్తం 1 లక్షా 60 వేల ఈవీఎంలు వినియోగించనున్నారు. 74 శాతం పోలింగ్ కేంద్రాల్లో అంటే 34,651 కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్‌కు ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. రాష్ట్రంలో 12,438 కేంద్రాల్ని సమస్యాత్మక కేంద్రాలుగా ఎన్నికల సంఘం గుర్తించింది.
రాష్ట్రంలో 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. అదే రంపచోడవరం, పాడేరు, అరకు నియోజకవర్గాల్లో అయితే 4 గంటలకే పోలింగ్ ముగిసిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సెక్షన్ 144 అమల్లోకి వచ్చింది. 48 గంటల వరకూ మద్యం షాపులు, బార్లు మూతపడనున్నాయి. నియోజకవర్గాల్లో స్థానికేతరులు ఉండరాదు.
రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది అభ్యర్ధులు పోటీ పడుతుంటే వీరిలో 417 మంది పురుషులు కాగా, 37 మంది మహిళలున్నారు. ఇక 175 అసెంబ్లీ స్థానాల్లో 2387 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. వీరిలో 2154 మంది పురుషులు కాగా, 231 మంది మహిళలున్నారు.
Also read: 4th Phase Lok Sabha Polls 2024: నేటితో తెలంగాణ, ఏపీ సహా 4వ విడత ఎన్నికల ప్రచారానికి ముగింపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook