Ap Congress Chief Ys Sharmila Fires On YS Jagan: తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు సమ్మర్ లో మరింత హీట్ ను పెంచుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, లోక్ సభ స్థానాలకు గాను షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. వైఎస్సార్సీపీ మరోసారి తమకు పట్టం కట్టాలని సీఎం జగన్ సిద్ధంపేరిట సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలోస్పీడ్ ను పెంచింది. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ కడప నుంచి ఎంపీ టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండంలో వైఎస్ షర్మిల చిన్న సుబ్బారాయుడు కుటుంబాన్న పరామర్శించారు. సుబ్బారాయుడు కొడుకు శ్రీనివాస్ ఇటీవల హత్యకు గురయ్యాడు.
Read More: Tukkuguda Meeting: తుక్కుగూడ సభలో భట్టి విక్రమార్కకు అవమానం.. ఓవరాక్షన్ చేసిన సీపీ తరుణ్ జోషి..
దీనిలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలే ఉన్నట్లు షర్మిల ఆరోపించారు. వైఎస్ జగన్, అవినాష్ అనుచరులే భూమి కోసం హత్యచేశారని ఆమె పేర్కొన్నారు. జగన్ ను ప్రజలు ఓట్లేసి గెలిపించింది.. ఇలాంటి హత్యారాజకీయాలు చేసేందుకా నంటూ.. ఆమె మండిపడ్డారు. అదే విధంగా సీఎం జగన్ ఒక కుంభకర్ణుడిలాంటి వాడన్నారు. ఎన్నికలు వచ్చాయి.. కాబట్టి ప్రజల్లో సింపతి కోసం ప్రచారం నిర్వహిస్తున్నారని అన్నారు. అదే విధంగా షర్మిల తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పించారు.
హత్యారాజకీయాలు చేసిన వారికి జగన్ అండగా ఉంటున్నాడని, వివేకాను హత్య చేసిన అవినాష్ కు ఎంపీ టికెట్ ఇచ్చాడంటూ కూడా ఎద్దేవా చేశారు. ఒకవైపు వైఎస్సార్ బిడ్డ,మరోవైపు వైఎస్ వివేకాను హత్య చేసిన నిందితుడు ఎవర్ని గెలిపించుకుంటారో మీ ఇష్టమని షర్మిల అన్నారు. ఎంపీగా గెలిపిస్తే.. వైఎస్ఆర్, వివేకా మాదిరిగా.. ఇక్కడే ఉండి ప్రజలకు మేలు చేస్తానంటూ కూడా షర్మిల వెల్లడించారు.
ప్రస్తుతం ఏపీలో జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలో నిలబడ్డాయి. అదే విధంగా కాంగ్రెస్ గెలుపే టార్గెట్ గా ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తుంది. వైఎస్సార్సీపీ ఎంత మంది వచ్చిన జగన్ మాత్రం సింగిల్ గా వస్తాడంటూ.. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook