Kadapa Road Accident: ఆగి ఉన్న లారీ ఢీకొన్న టెంపో.. ముగ్గురు మహిళలు మృతి, 8 మందికి తీవ్రగాయాలు

Road Accident In Kadapa: వారందరూ మరో అరగంటలో గమ్య స్థానానికి చేరుకుంటామని అనుకున్నారు. కానీ డ్రైవర్ నిద్ర మత్తు ప్రాణాల మీదకు తెస్తుందని ఊహించలేదు. కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2023, 12:25 PM IST
  • కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • ఘటన స్థలంలోనే ముగ్గురు మహిళలు మృతి
  • 8 మందికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
Kadapa Road Accident: ఆగి ఉన్న లారీ ఢీకొన్న టెంపో.. ముగ్గురు మహిళలు మృతి, 8 మందికి తీవ్రగాయాలు

Road Accident In Kadapa: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చాపాడు వద్ద తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని టెంపో వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు వెంటనే దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. మృతులను అనూష, ఓబులమ్మ, రామలక్ష్మమ్మగా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇలా.. 

ప్రొద్దుటూరు వైఎమ్మార్ కాలనీకి చెందిన 15 మంది కుటుంబ సభ్యులు తిరుపతికి వెళ్లారు. తిరుపతి నుంచి ప్రొద్దుటూరుకు టెంపోలో తిరిగి వస్తుండగా.. శుక్రవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు మహిళలు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 8 మందికి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి వెంటనే ప్రొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. 

టెంపో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. మృతి చెందిన ముగ్గురు మహిళలు ప్రొద్దుటూరుకు చెందినవారే. గాయపడిన వారందూరు అనంతపురం, హైరదాబాద్‌లకు చెందిన బంధువులుగా గుర్తించారు. మృతుల్లో రామలక్ష్మి, ఓబులమ్మ  అక్కాచెల్లెళ్లు అని.. అనూష రామలక్ష్మి కుమార్తె అని బంధువులు చెబుతున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో ప్రొద్దుటూరు వైఎమ్మార్ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Also Read: Hockey India: వరల్డ్‌కప్‌లో టీమిండియా రెండో విజయం.. క్వార్టర్ ఫైనల్ చేరాలంటే..  

Also Read: AP Govt: డీఏ చెల్లింపునకు సీఎం జగన్ ఒకే.. అందుకే జాప్యం: ఏపీఎన్జీవో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News