Afghanistan: ప్లీజ్‌ మా పిల్లలనైనా తీసుకెళ్లండి..ఇనుప కంచెపై నుంచి విసిరేస్తున్న తల్లులు!

Afghanistan: తాలిబన్ల అరాచక పాలన నుంచి తప్పించుకునేందుకు ఆఫ్గాన్ పౌరులు చేయని ప్రయత్నం లేదు. వారు సాయం కోసం చేస్తున్న ఆర్తనాదాలు అమెరికా, యూకే సైనికులు సైతం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 19, 2021, 05:34 PM IST
  • కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద హృదయ విధారకర దృశ్యాలు
  • కంచెల్లోనే చిక్కుకున్న కొందరు చిన్నారులు
  • మంచి భవిష్యత్ కోసం ఆఫ్గన్ మహిళల ఆరాటం
Afghanistan: ప్లీజ్‌ మా పిల్లలనైనా తీసుకెళ్లండి..ఇనుప కంచెపై నుంచి విసిరేస్తున్న తల్లులు!

Afghanistan: తాలిబన్లు ఆరాచకాలకు ఒక తరం ఎంతో నష్టపోయింది. మళ్లీ గాడిన పడుతున్నాం అనుకునేలోగానే మరోసారి ఆపద కమ్మేసింది. తర్వాత తరమైన బాగుపడాల్న ఉద్దేశంతో అఫ్గనిస్థాన్ మహిళలు..తమ పిల్లలను కాబూల్ విమానాశ్రయం(Kabul Airport) చుట్టూ పెట్టిన కంచెల పైనుంచి ఎయిర్ పోర్టులోకి విసిరేస్తున్నారు. తమ పిల్లలనైనా కాపాడి తీసుకెళ్లండంటూ ఆమెరికా, బ్రిటన్ దేశాల సైన్యానికి మెురపెట్టుకుంటున్నాయి. వారి పెడుతున్న ఆర్తనాదాలు సైన్యానికే కన్నీరు తెప్పిస్తున్నాయి.  

అఫ్గాన్‌(Afghanistan)లో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు అమెరికా(America), యూకే(UK) ప్రభుత్వాలు ప్రత్యేక బలగాలను పంపిన విషయం తెలిసిందే. కాబుల్‌ విమానాశ్రయాన్ని ఆధీనంలోకి తీసుకొని వీరంతా పహారా కాస్తున్నారు. అయితే, తాలిబన్ల(Talibans) పాలనతో భయాందోళనకు గురైన అఫ్గాన్‌ వాసులు కూడా దేశం విడిచి పారిపోయేందుకు గత సోమవారం ఎయిర్‌పోర్టుకు పోటెత్తారు. దీంతో అక్కడ భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో విమానాశ్రయం వద్దకు తాలిబన్లు చేరుకుని అఫ్గాన్ వాసుల(Afghan People)ను అడ్డుకున్నారు. గేట్లు మూసేసి ఇనుప కంచెలు అడ్డుపెట్టారు. 

Also Read: Ashraf Ghani: 'కట్టుబట్టలతో అఫ్గాన్‌ విడిచి వెళ్లిపోయా'..

అయినప్పటికీ అక్కడకు చేరుకున్న వేలాది మంది అఫ్గానీయులు(Afghan People).. తమను కాపాడాలంటూ యూకే, యూఎస్‌ బలగాలను అభ్యర్థిస్తున్నారు. కనీసం తమ పిల్లలనైనా తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు. కొందరు మహిళలు ఇనుప కంచెల పైనుంచే పిల్లలను విసిరేసి విదేశీ దళాలను పట్టుకోమని అడుగుతున్నారు. ఈ క్రమంలో కొందరు చిన్నారులు కంచెలో చిక్కుకుంటున్నారు అంటూ ఓ బ్రిటిష్‌ అధికారి మీడియాకు చెప్పారు. ఆ దృశ్యాలు తమను ఎంతగానో కలచివేస్తున్నాయని, వాటిని తలుచుకుని రాత్రిళ్లు తాము కన్నీరు పెట్టుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter Facebook

Trending News