ప్రపంచాన్ని వణికిస్తున్న డెల్టా వేరియంట్‌పై తస్మాత్ జాగ్రత్త

Delta Variant: కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విలయం ఇంకా తొలగలేదు. ఇప్పుడు అదే డెల్టా వేరియంట్ ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతోంది. వణికిస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 2, 2021, 04:01 PM IST
ప్రపంచాన్ని వణికిస్తున్న డెల్టా వేరియంట్‌పై తస్మాత్ జాగ్రత్త

Delta Variant: కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విలయం ఇంకా తొలగలేదు. ఇప్పుడు అదే డెల్టా వేరియంట్ ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతోంది. వణికిస్తోంది. 

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్‌(Corona Second Wave)కు కారణమైన డెల్టా వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతోంది. కరోనా విపత్కర పరిస్థితుల్నించి కోలుకోకముందే డెల్టా వేరియంట్ కలకలం రేపుతోంది. డెల్టా వేరియంట్ తీవ్రత, ప్రమాదంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధిక శాతం డెల్టా వేరియంట్ కావడమే దీనికి కారణం. కరోనా సంక్రమణను అడ్డుకోలేకపోతే మరిన్ని మ్యూటేషన్స్ పుట్టుకొచ్చి మరింత ప్రమాదకరంగా పరిస్థితి తయారవుతుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. కరోనా వైరస్‌ను అంతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని వార్నింగ్ జారీ చేసింది.

ఇప్పటి వరకూ ప్రపంచంలోని 132 దేశాల్లో డెల్టా వేరియంట్ (Delta Variant)ప్రభావం కన్పించిందన్నారు. వైరస్ రూపాంతరం చెందుతూ ఇప్పటికే నాలుగు వేరియంట్లుగా మారిందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ తెలిపారు.కరోనా వైరస్ కేసులు గత 4 వారాల్లో 80 శాతం పెరిగాయని గుర్తు చేశారు. భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటివి మానకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)సభ్యదేశాల్లో సగం దేశాలు అది కూడా పదిశాతం డోసులు అందించాయి. 

Also read: తాలిబన్ స్థావరాలపై ఆఫ్ఘనిస్తాన్ దాడులు, 250 మంది ఉగ్రవాదులు మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News