Birth Right Citizenship: అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో హామీల్లో ఒకటైన బెర్త్ రైట్ పౌరసత్వం రద్దు చేశారు. విదేశాల్నించి అమెరికాలో స్థిరపడినవారికి, భారతీయ వలసదారులకు ఇది మింగుడుపడని పరిణామంగా మారింది.
డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. బర్త్ రైట్ పౌరసత్వం అంటే తల్లిదండ్రులు విదేశీయులైనా సరే బిడ్డ అమెరికాలో జన్మిస్తే పౌరసత్వం లభిస్తుంది. ఈ విధానం ఇప్పట్నించి కాదు..1868 నుంచి అమల్లో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో నల్ల జాతీయుల్ని బానిసలుగా చేసే పద్ధతిని అడ్డుకునేందుకు అమెరికాలో అంతర్యుద్ధం తరువాత 1868లో రాజ్యాంగంలో 14వ సవరణతో బెర్త్ రైట్ పౌరసత్వం ప్రవేశపెట్టారు. అప్పట్నించి ఈ విధానం కొనసాగుతోంది. ఎందరో విదేశీయులు ఈ చట్టం కారణంగా పౌరసత్వం పొందారు. ముఖ్యంగా ఇండియా, చైనా నుంచి వెళ్లినవారు లబ్దిపొందారు.
బర్త్ రైట్ పౌరసత్వం రద్దు చేసిన ట్రంప్
ఇప్పడు డోనాల్డ్ ట్రంప్ ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అమెరికాలో పుట్టిన బిడ్డకు పౌరసత్వం లభించాలంటే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధమైన నివాసి లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయుండాలి. లేదా అమెరికా సైనికుడిగా ఉండాలి. ఈ అర్హతలు లేకుంటే అమెరికాలో పుట్టినా సరే పౌరసత్వం లభించదు. ఫిబ్రవరి 20,225 నుంచి కొత్త ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. అప్పటి వరకూ పుట్టిన పిల్లలకు యూఎస్ పౌరసత్వం లభించినట్టే. ఇకపై మాత్రం ఉండదు.
2024 వరకు భారతీయ అమెరికన్ల సంఖ్య 5.4 మిలియన్లుగా ఉంది. ఇది యూఎస్ జనాభాలో 1.47 శాతం. వలసదారుల్లో మూడింటి రెండు వంతులు భారతీయులే ఉన్నారు. 34 శాతం మంది అమెరికాలో జన్మించి పౌరసత్వం పొందినవారే కావడం విశేషం. ట్రంప్ తాజా ఉత్తర్వులతో భారతీయులపై అత్యధికంగా ప్రభావం పడనుంది. బర్త్ టూరిజం కూడా ఇకపై సాధ్యం కాదు. ఎందుకంటే చాలామంది ఉన్నత కుటుంబాలకు చెందిన భారతీయులు అమెరికాలో పిల్లల్ని కనాలని కోరుకుంటారు. తద్వారా అమెరికన్ పౌరసత్వం లభించాలనుకుంటారు. ఇప్పుడీ బర్త్ టూరిజం విధానానికి ట్రంప్ స్వస్తి పలికారు.
బర్త్ రైట్ పౌరసత్వం రద్దు అమలు సాధ్యమేనా
ఈ చట్టాన్ని రద్దు చేస్తూ డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ రాజ్యాంగ సవరణ అవసరమౌతుంది. ఇది అంత సులభంగా జరిగేది కాదు. అమెరికాలో రాజ్యాంగ సవరణ అంటే హౌస్, సెనెట్ రెండింటిలో మూడింటి రెండు వంతుల మెజార్టీ అవసరం. దాంతోపాటే రాష్ట్ర శాసనసభల్లో మూడింటి రెండు వంతులు ఆమోదం ఉండాలి. కొత్త సెనెట్‌లో డెమోక్రట్లు 47 మంది ఉంటే రిపబ్లికన్లు 53 మంది ఉన్నారు. హౌస్ డెమోక్రట్లు 215 మంది ఉంటే, రిపబ్లికన్లు 220 మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మూడింటి రెండు వంతుల మెజార్టీ లభించడం కష్టమే. అంతేకాకుండా యూఎస్ సుప్రీంకోర్టు కూడా జన్మత వచ్చే పౌరసత్వాన్ని సమర్థించింది.
Also read: EPFO Big Update: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్, పెరగనున్న కనీస పెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి