UNSC: 'ముంబయి ఉగ్రదాడి నిందితులకు పాక్ సాయం అందుతూనే ఉంది'.. ఐరాస వేదికగా దాయాది తీరును ఎండగట్టిన భారత్

UNSC: దాయాది దేశంపై భారత్‌ విరుచుకుపడింది. 'సాయుధ పోరాటంలో పౌరులకు రక్షణ' అనే అంశంపై జరిగిన చర్చలో భాగంగా ఐరాసలో పాక్ తీరును మరోసారి ఎండగట్టింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 02:47 PM IST
  • ఐరాస వేదికగా పాక్ పై భారత్ ఆగ్రహం
  • దాయాది దారుణ రికార్డును బయటపెట్టిన భారత్
UNSC: 'ముంబయి ఉగ్రదాడి నిందితులకు పాక్ సాయం అందుతూనే ఉంది'.. ఐరాస వేదికగా దాయాది తీరును ఎండగట్టిన భారత్

India at UNSC: ఐరాస వేదికగా పాకిస్తాన్ పై భారత్ (India) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. 2008లో జరిగిన ముంబయి ఉగ్రదాడి నిందితులకు (Mumbai attack perpetrator) పాకిస్థాన్‌ (Pakistan) మద్దతు ఇంకా అందుతూనే ఉందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)లో పేర్కొంది. అంతేకాకుండా భారత్‌కు వ్యతిరేకంగా  తప్పుడు ప్రచారం చేస్తూ.. ఐరాస వేదికను దుర్వినియోగం చేస్తోందని మండిపడింది.

"మేము ఈ రోజు పౌరుల రక్షణ గురించి చర్చిస్తున్నాం. ఇప్పుడు వారికి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉంది. 2008లో ముంబయిలో జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రదాడికి సంబంధించిన నిందితులకు వారి దేశం మద్దతు లభిస్తూనే ఉంది''. యూఎన్ లో 'సాయుధ పోరాటంలో పౌరులకు రక్షణ' అనే అంశంపై జరిగిన చర్చలో భారత్ ఈ వ్యాఖ్యలు చేసింది. 

Also Read: CPI 2021: అనివీతి సూచీలో 16 స్థానాలు దిగజారిన పాక్..భారత్ ర్యాంక్ ఎంతంటే..

‘యూఎన్ లో భారతదేశ శాశ్వత మిషన్‌లో కౌన్సెలర్ ఆర్. మధు సూదన్ (R Madhu Sudan) మాట్లాడుతూ... ''ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, సహాయం చేయడం, మద్దతు ఇవ్వడంలో పాకిస్థాన్‌ చరిత్ర, దాని విధానం సభ్య దేశాలకు తెలుసు. సాయుధ మూకలకు ఆర్థిక సహాయం చేస్తూ, ఆయుధాలు అందించే దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఐరాస నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రవాదులకు ఆతిథ్యం ఇస్తున్న దేశంగా దారుణమైన రికార్డును సొంతం చేసుకొంది. అది ఎంతగా ఉందంటే.. ప్రపంచవ్యాప్తంగా చాలా ఉగ్రదాడులు ఏదో ఒకరూపంలో పాక్‌ మూలాల్ని కలిగి ఉన్నాయి''’ అంటూ తీవ్రంగా స్పందించింది. 

అలాగే జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) అంశంపై మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది. అలాగే పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాలు కూడా తనలో భాగమేనని, వాటిని వెంటనే ఖాళీ చేయాలని తేల్చి చెప్పింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News