Ukraine Plane Crash: గ్రీస్ లో కూలిన ఉక్రెయిన్ కార్గో విమానం.. రసాయనాల పేలుడుతో పెను ముప్పు

Ukraine Plane Crash:  ఉక్రెయిన్ క్యారియర్ నడుపుతున్న కార్గో విమానం గ్రీస్‌లో కూలిపోయింది. ఉత్తర గ్రీస్‌లోని కవాలా నగరానికి సమీపంలో ఉక్రెయిన్ విమానయాన సంస్థ నిర్వహిస్తున్న ఆంటోనోవ్ కార్గో విమానం శనివారం కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా దగ్ధమైందని తెలుస్తోంది

Written by - Srisailam | Last Updated : Jul 17, 2022, 09:54 AM IST
Ukraine Plane Crash: గ్రీస్ లో కూలిన ఉక్రెయిన్ కార్గో విమానం.. రసాయనాల పేలుడుతో పెను ముప్పు

Ukraine Plane Crash:  ఉక్రెయిన్ క్యారియర్ నడుపుతున్న కార్గో విమానం గ్రీస్‌లో కూలిపోయింది. ఉత్తర గ్రీస్‌లోని కవాలా నగరానికి సమీపంలో ఉక్రెయిన్ విమానయాన సంస్థ నిర్వహిస్తున్న ఆంటోనోవ్ కార్గో విమానం శనివారం కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా దగ్ధమైందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన రెండు గంటల పాటు భారీగా మంటలు వచ్చాయని, భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు.ఈ విమానం సెర్బియా నుంచి జోర్డాన్‌కు వెళ్తోందని గ్రీక్ సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు.
An-12 విమానం సోవియట్ యూనియన్ టర్బోప్రాప్ విమానం. కార్గో క్యారియర్ మెరిడియన్ ద్వారా ఆపరేట్ చేయబడుతుంది. ప్రమాద సమయంలో కార్గో విమానంలో ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో మొత్తం 12 టన్నుల ప్రమాదకరమైన రసాయన కెమికెల్స్ ఉన్నట్లు గ్రీస్ మీడియా సమచారం. అందుకే విమానం క్రాష్ కాగానే పేలుడు పదార్ధాలు పేలడంతో భారీగా శబ్దాలు వచ్చాయని, మంటలు ఎగిసిపడ్డాయని భావిస్తున్నారు. రసాయన కెమికెల్స్ దగ్ధం కావడంతో ఘటనాస్థలంలో దుర్వాసన వస్తోందని సమాచారం. దీంతో అధికారులు స్థానికులకు అప్రమత్తం చేశారు.  మున్సిపల్, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులతో కూడిన సమన్వయ కమిటీ.. ఘటనాస్థలానికి సమీపంలో ఉన్న ప్రజలను ఇళ్ల నుంచి బయటికి రావొద్దని హెచ్చరించింది. ఇళ్ల  కిటికీలను మూసి ఉంచాలని ఆదేశించింది. విమానంలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయో లేదో ఇంకా నిర్ధారించలేదని స్థానిక అధికారులు చెబుతున్నారు.

గ్రీస్ పౌర విమానయాన అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం కార్గో విమానం టేకాఫ్ కాగానే ఇంజిన్‌లలో ఒకదానిలో సమస్య ఉందని పైలట్ గుర్తించి అధికారులను అప్రమత్తం చేశాడు. ఫ్లైట్ ను థెస్స  లేదా కవాలా విమానాశ్రయాలలో ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించాడు. చివరికి కవాలాను పైలెట్ ఎంచుకున్నాడు.  అయితే అత్యవసర ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా విమానంతో కమ్యూనికేషన్ దాదాపు వెంటనే ఆగిపోయింది. విమానాశ్రయానికి పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయింది. ప్రమాదం తర్వాత కొన్ని నిమిషాల పాటు భారీగా పేలుడు శబ్దాలు వచ్చాయని పగ్గియో మునిసిపాలిటీ మేయర్ ఫిలిప్పోస్ అనస్తాసియాడిస్ చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి తాము 300 మీటర్ల దూరంలోనే ఉన్నామని, క్రాష్ తర్వాత రెండు గంటల పాటు పేలుళ్లు వినిపించాయని అనస్టాస్సియాడిస్ తెలిపారు. ప్రమాదానికి ముందు మంటలు, దట్టమైన పొగలు కమ్ముకున్నట్లు స్థానికులు తెలిపారు.

Read also: Hyderabad Gun Shot: లారీ డైవర్ పై సినీ ఫక్కీలో కాల్పులు... హైదరాబాద్ లో కలకలం!  దారి దోపిడీ గ్యాంగ్ పనేనా?  

Read also: Who is Jagdeep Dhankhar: ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధంకర్‌.. ఇంతకీ ఎవరీ జగదీప్ ధంకర్ ? 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News