Plane Crashes In Brazil: బ్రెజిల్ దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. బయల్దేరిన తర్వాత కొద్దిసేపటికే కూలింది. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ప్రమాదం ధాటికి విమానంలోని వారంతా మరణించినట్లు సమాచారం. ఈ విషయాన్ని బ్రెజిల్ జాతీయ మీడియా ధ్రువీకరించింది.
Also Read: Sheikh Hasina Resign: బంగ్లాదేశ్‌లో సైనిక పాలన? ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా
బ్రెజిల్‌లోని పరానా రాష్ట్రంలోని కాస్‌కవెల్ నుంచి బయల్దేరిన విమానం సావో పాలో రాష్ట్రంలోని గౌరుల్ హోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్న విమానం విన్హెడో నివాస ప్రాంతంలో కూలిపోయింది. విమానం కూలిపోయిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానం కాలిబూడిదైంది. ప్రమాదంపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం చోటుచేసుకున్న వెంటనే భద్రతా సిబ్బంది, పోలీస్, మిలిటరీ దళాలు సహాయ చర్యలు చేపట్టాయి.
Also Read: Bangladesh Protests Live Updates: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల చిచ్చు.. దేశం వీడిన ప్రధాని షేక్ హసీనా
ప్రమాదం జరిగిన చోటు నివాస ప్రాంతం కావడంతో స్థానికులు కూడా చనిపోయి ఉంటారని తెలుస్తోంది. విమానం కూలిన చోట ఇళ్లు, గుడిసెలు ఉన్నాయని అక్కడి మీడియా చెబుతోంది. అయితే ఆ విమానం ఏ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించినదో ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలు అక్కడి అధికారులు తెలుసుకుంటున్నారు. విమానం కూలుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఆకాశం నుంచి విమానం కూలిన దృశ్యాలు రికార్డయ్యాయి.
❗️✈️💥🇧🇷 - #BREAKING: A plane has crashed in São Paulo, Brazil, claiming the lives of 70 people.
Initial reports suggest the aircraft was en route from Cascavel (PR) to Guarulhos (SP).
Details about the victims are still unknown. According to eyewitness videos, the plane… pic.twitter.com/pK1sbUSG8h
— 🔥🗞The Informant (@theinformant_x) August 9, 2024
🚨🇧🇷 BREAKING:
Video footage shows the aftermath of the plane crash that allegedly resulted in the deaths of 68 passengers.#Brazil #planecrash pic.twitter.com/e15sQZPqPM
— Berkan Yılmaz (@Berk04790) August 9, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook