Sri Lanka Crisis: శ్రీలంకలో దారుణం.. చివరి రోజుకు చేరుకున్న పెట్రోల్, డీజిల్ నిల్వలు!

Sri Lanka Crisis: శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ నిల్వలు మరో ఒక్కరోజుకు మాత్రమే సరిపడా ఉన్నాయని ఆయన దేశ నూతన ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే అన్నారు. ఇటీవలే ప్రధాని బాధ్యతలు చేపట్టిన ఆయన.. దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం గురించి చేసిన ప్రసంగంలో ఆయన ప్రస్తావించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 11:30 AM IST
Sri Lanka Crisis: శ్రీలంకలో దారుణం.. చివరి రోజుకు చేరుకున్న పెట్రోల్, డీజిల్ నిల్వలు!

Sri Lanka Crisis: శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఇటీవలే మహింద రాజపక్స ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు స్వీకరించారు. పదవీ చేపట్టిన తర్వాత తొలిసారి ప్రధాన మంత్రి విక్రమ సింఘే ప్రసంగించారు. ఆ ప్రసంగంలో దేశంలో నెలకొన్న దారుణమైన ఆర్థిక పరిస్థితుల గురించి ఆయన స్పష్టం చేశారు. 

శ్రీలంకలో మరో ఒక్కరోజుకు సరిపడిన పెట్రోల్ నిల్వలు ఉన్నాయని ప్రధాని విక్రమ సింఘే తన ప్రసంగంలో తెలియజేశారు. భారత్ నుంచి రుణ ప్రాతిపాదికన వస్తున్న పెట్రోల్, డీజిల్ నిల్వలు కొన్ని రోజుల పాటు శ్రీలంకకు దిక్కని ఆయన స్పష్టం చేశారు. దేశంలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన సంస్కరణల్లో భాగంగా నష్టాల్లో ఉన్న జాతీయ విమానయాన సంస్థను ప్రైవేటీకరించాలని కూడా ఆయన ప్రతిపాదించారు.

ఈ క్రమంలో ఆ దేశంలోని సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రధాన మంత్రి విక్రమసింఘే కొన్ని పరిష్కార మార్గాలను ప్రస్తావించారు. ఈ క్రమంలో రానున్న రెండు నెలలు ప్రజా జీవనం ఎంతో కీలకంగా మారిందని.. ప్రజలంతా కొన్ని త్యాగాలు చేయడం సహా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 

Also Read: North Korea Corona: ఉత్తర కొరియాలో కరోనా టెర్రర్..హెల్త్ ఎమర్జెన్సీ విధింపు..!

Also Read: Russia vs Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఒరిగిందేంటి..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News