Heavy Snowfall: మంచుతుపానులో కూరుకుపోయిన అమెరికా, మరో రెండు వారాలు తప్పదని హెచ్చరిక

Heavy Snowfall: అగ్రరాజ్యం ఇప్పుడు హిమపాతంలో చిక్కుకుపోతోంది. తీవ్ర మంచుతుపానుతో రవాణా స్థంబించిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈశాన్య రాష్ట్రాల్లో కదలిక నిలిచిపోయింది. 

Last Updated : Feb 3, 2021, 12:07 PM IST
Heavy Snowfall: మంచుతుపానులో కూరుకుపోయిన అమెరికా, మరో రెండు వారాలు తప్పదని హెచ్చరిక

Heavy Snowfall: అగ్రరాజ్యం ఇప్పుడు హిమపాతంలో చిక్కుకుపోతోంది. తీవ్ర మంచుతుపానుతో రవాణా స్థంబించిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈశాన్య రాష్ట్రాల్లో కదలిక నిలిచిపోయింది. 

అమెరికా ( America )లో ఇప్పుడు భారీ హిమపాతం కురుస్తోంది. పదిహేను రోజుల్నించి భారీగా మంచు ( Heavy Snowfall ) కురుస్తున్నా..గత రెండ్రోజుల్నించి పరిస్థితి మరీ తీవ్రమైంది. తీవ్ర మంచుతుపానుగా మారింది. ముఖ్యంగా ఈశాన్య అమెరికా రాష్ట్రాల్లో( Eastern American states ) పరిస్థితి దయనీయంగా ఉంది. భారీగా మంచు కురుస్తుండటంతో ఎక్కడికక్కడ రవాణా స్థంబించిపోయింది. నీరు గడ్డకట్టుకుపోయింది. నదులు, సరస్సులు మంచుగడ్డలుగా మారిపోయాయి. మంచు తుపాను కారణంగా రెండ్రోజుల్నించి రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. హిమపాతం కారణంగా వ్యాక్సినేషన్ ( Vaccination )ప్రక్రియ నిలిచిపోయింది. 

ముఖ్యంగా మయిన్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ రాష్ట్రాల్లో, మస్సాచుసెట్స్‌లోని బోస్టన్‌లో భారీగా హిమపాతం నమోదైంది. న్యూజెర్సీలో అత్యధికంగా 76 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. మన్‌హట్టన్ సెంట్రల్ పార్క్‌లో 43 సెంటీమీటర్ల మేర మంచు కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. న్యూహాంప్‌షైర్ నార్త్‌లో అడుగు మేర మంచు పేరుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. భారీగా కురుస్తున్న మంచు కారణంగా న్యూజెర్సీలోనే 661 వాహనా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మరో రెండు వారాల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ( Mateorology Department )హెచ్చరిస్తోంది. 

Also read: Candida auris fungus: కోవిడ్ కంటే భయంకరమైంది..వస్తోంది తస్మాత్ జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News