Russia Ukraine War: దిల్లీ చేరిన ఎయిర్ ఇండియా రెండో విమానం.. విద్యార్థుల హర్షం!

Russia-Ukraine Crisis: 250 మంది భారతీయులతో రొమేనియా నుంచి బయల్దేరిన ఎయిర్​ ఇండియా రెండో విమానం దిల్లీకి చేరుకుంది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2022, 09:01 AM IST
  • దిల్లీకి చేరిన రెండో విమానం
  • క్షేమంగా బయటపడ్డ భారతీయ విద్యార్థులు
Russia Ukraine War: దిల్లీ చేరిన ఎయిర్ ఇండియా రెండో విమానం.. విద్యార్థుల హర్షం!

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత్ 'ఆపరేషన్​ గంగా' (Operation Ganga) చేపట్టింది. ఇందులో భాగంగా..250 మంది భారతీయులతో రొమేనియా నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా (Air India) రెండో విమానం దిల్లీ చేరుకుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ విద్యార్థులకు స్వాగతం పలికారు.

దిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న విద్యార్థులతో కేంద్రమంత్రి సింధియా కొద్దిసేపు ముచ్చటించారు. ఉక్రెయిన్​ పరిస్థితులపై ఎలాంటి ఆందోళన చెందవద్దని.. అక్కడ చిక్కుకున్న ఇతర భారతీయులకు కూడా ధైర్యం చెప్పాలని ఆయన సూచించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ (PM Modi) ఎప్పటికప్పడు మాట్లాడుతున్నారని.. మిగతా వారిని ఇంటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేంద్రమంత్రి అన్నారు. భారత్​కు సురక్షితంగా చేరుకోవడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం రొమేనియా నుంచి 219 మంది భారతీయులతో బయల్దేరిన తొలి విమానం ముంబయికి చేరుకుంది.

స్పెషల్ ప్లైట్ లో దిల్లీకి వచ్చిన వారిలో ఏపీ విద్యార్థులు రాజుల పాటి అనూష, సిమ్మ కోహిమ వైశాలి వేముల వంశి కుమార్, అభిషేక్ మంత్రి, జయశ్రీ, హర్షిత కౌసర్, సూర్య సాయి కిరణ్ ఉన్నారు. తెలంగాణకు చెందిన విద్యార్థులు వివేక్, శ్రీహరి, తరుణ్, నిదిష్, లలితా, దేవి, దివ్య, ఐశ్వర్య, మాన్య, మహిత, ప్రత్యూష, గీతిక, లలిత, తరణి, మనీషా, రమ్య ఉన్నారు. వీరిని  తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ రిసీవ్ చేసుకున్నారు. వీరిని వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Also read: Russia-Ukraine war: రొమానియా నుంచి ముంబయికు బయల్దేరిన విమానం.. ఫ్లైట్ లో 219 మంది భారతీయులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News