కరడుగట్టిన తీవ్రవాదిని వెనకేసుకొచ్చిన పాక్ ప్రధాని

ఓవైపు భారత్, మరోవైపు అమెరికా ఎన్నిసార్లు ఒత్తిడి తీసుకొచ్చినా... పాకిస్థాన్ మాత్రం తీవ్రవాదులనే సమర్ధిస్తూ వస్తోంది.

Last Updated : Jan 17, 2018, 03:24 PM IST
కరడుగట్టిన తీవ్రవాదిని వెనకేసుకొచ్చిన పాక్ ప్రధాని

ఓవైపు భారత్, మరోవైపు అమెరికా ఎన్నిసార్లు ఒత్తిడి తీసుకొచ్చినా... పాకిస్థాన్ మాత్రం తీవ్రవాదులనే సమర్ధిస్తూ వస్తోంది. ముంబై దాడులలో ప్రధాన సూత్రధారి అయిన జమాత్ ఉద్ దవా తీవ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయీద్‌ని వెనకేసుకొచ్చిన పాకిస్థాన్ ప్రధాని షాహీద్ ఖకాన్ అబ్బాసి.. పాక్‌లో అతడిపై ఎటువంటి కేసులు లేవని స్పష్టంచేశారు. తాజాగా ఓ టీవీ ఛానెల్‌తో పాక్ ప్రధాని అబ్బాసి మాట్లాడుతూ... ''హఫీజ్ సయీద్ సాబ్" అని సంబోధించడం చూస్తే, భారత్ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌పై పాక్ ప్రధానికి ఎంత గౌరవం, అభిమానం వున్నాయో ఇట్టే అర్థమవుతోంది.

పాకిస్థాన్‌కి ఇవ్వాల్సి వున్న ఆర్థిక సహాయాన్ని నిలిపేస్తున్నట్టు ఇటీవల అమెరికా ప్రకటించిన వెంటనే హఫీజ్ సయీద్ నేతృత్వం వహిస్తున్న జమాత్ ఉద్ దవా సంస్థపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అతడు ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ విరాళాల రూపంలో నిధులు సమీకరించడంపై సైతం నిషేధం విధించింది. అయితే, మళ్లీ ఇంతలోనే పాక్ మనసు మార్చుకుని హఫీజ్ సయీద్ మచ్చ లేని మనిషి అని క్లీన్ చిట్ ఇవ్వడం చూస్తోంటే పాకిస్థాన్ అతడి అరాచకాలకి ఇంకా మద్దతు ఇవ్వాలనే అనుకుంటున్నట్టు తేటతెల్లమవుతోంది.

Trending News