North Korea Corona: ఉత్తర కొరియాలో మాయదారి వైరస్ విజృంభణ..వణికిపోతున్న ప్రజలు..!

North Korea Corona: ప్రపంచ దేశాలను కరోనా కలవర పెడుతోంది. రోజులవారి కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతున్నాయి. దీంతో ఆయా దేశాలు ఆంక్షలను కఠినతరం చేశాయి. నిబంధనలు పక్కగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తర కొరియాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 06:14 PM IST
  • మళ్లీ విజృంభిస్తున్న కరోనా
  • ఉత్తర కొరియాలో రెట్టింపు అవుతున్న కేసులు
  • ఆంక్షలను కఠిన తరం చేసిన కిమ్
North Korea Corona: ఉత్తర కొరియాలో మాయదారి వైరస్ విజృంభణ..వణికిపోతున్న ప్రజలు..!

North Korea Corona: ప్రపంచ దేశాలను కరోనా కలవర పెడుతోంది. రోజులవారి కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతున్నాయి. దీంతో ఆయా దేశాలు ఆంక్షలను కఠినతరం చేశాయి. నిబంధనలు పక్కగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తర కొరియాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. అక్కడ వైద్య సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  మంగళవారం ఒక్కరోజే 2 లక్షల 69 వేల 510 మందిలో  కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఆరుగురు మృత్యు ఒడికి చేరినట్లు ప్రకటించారు. 

ఐతే అనధికారికంగా కేసుల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొలి కేసు బయట పడినప్పటి నుంచి ఇప్పటివరకు 1.48 మిలియన్ల మందిలో కరోనా లక్షణాలు బయట పడ్డాయి. 56 మంది కరోనాకు బలైయ్యారు. ఇప్పటివరకు ఉత్తర కొరియాలో ఆరున్నర లక్షల మందికిపైగా క్వారంటైన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసులు,మరణాల సంఖ్యను అధికారికంగా ప్రకటించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. 

గత వారం ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు గుర్తించారు. దీంతో అలర్ట్ అయిన కిమ్ జాంగ్ ఉన్ ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. ప్రజలకు మందులను అందించడంలో వైద్యాధికారులు విఫలం కావడంపై ఆయన ఫైర్ అయ్యారు. దీంతో మిలటరీ వైద్య విభాగం రంగంలోకి దిగింది. రాజధాని ప్యాంగాంగ్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో మందు సరఫరాను ఉధృతం చేశారు. 

ఇప్పటివరకు దేశంలో దాదాపు 15 లక్షల మందిలో జ్వరం ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. మొత్తం 6 లక్షల 63 వేల 910 మంది చికిత్స పొందుతున్నారు. 56 మంది మరణించినట్లు అక్కడి మీడియం సైతం కథనాలు ఇస్తోంది. ఉత్తర కొరియాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరగకపోవడంతో ఉధృతి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. 

ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా ఆపన్న హస్తం అందిస్తోంది. వైద్య పరికరాలు, వ్యాక్సిన్లు, మాస్కులు, టెస్ట్‌ కిట్లను పంపిణీ చేస్తోంది. ఉత్తర కొరియా(NORTH KOREA) పరిస్థితిపై ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వైరస్‌ నుంచి తొందర బయటపడాలని ఆకాంక్షిస్తున్నాయి. అవసరమైన సహాయం చేసేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటామని అంటున్నాయి. 

Also read:KTR's Achhe Din Tweet: అచ్ఛే దిన్ అంటే ఇదేనా..మంత్రి కేటీఆర్ ట్వీట్..ప్రధాని కౌంటర్.!

Also read:YSRCP Candidates: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News