ముంబై.. ఈ నగరం నిద్రపోదు. పనిని ఆపదు.. నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఇక్కడున్న వారికి కూడా అదే అలవాటైంది. ప్రపంచంలోని ఇతర నగరాలతో పోలిస్తే ముంబైవాసులు అధికంగా పనిచేస్తారని స్విస్ బ్యాంక్ (యూబీఎస్)తెలిపింది. 77 నగరాల్లో చేసిన సర్వేల్లో ముంబై వాసులు ఏడాదికి 3314.7 గంటలు (సగటు పనిగంటలు 1987) పనిచేస్తారని సర్వేల్లో వెల్లడైంది. ఇది రోమ్(1581), పారిస్(1662) పనిగంటల కంటే రెట్టింపు. ముంబై తరువాత కష్టపడుతున్న నగరాల్లో హనోయి(2691.4 గంటలు), మెక్సికో సిటీ(2622.1), న్యూఢిల్లీ(2511.4), బొగోట (2357.8) నగరాలు ఉన్నాయి. తక్కువ కష్టపడుతున్న నగరాలు: లాగోస్ (609.4), రోమ్(1581.4), పారిస్(1662.6), కోపెన్ హగెన్(1711.9), మాస్కో (1719.6)
సెలవుల విషయానికి వస్తే.. ముంబైవాసులు 10 రోజులు వెకేషన్ డేస్ తీసుకుంటారని సర్వే పేర్కొంది. లాస్ ఏంజల్స్ కూడా ముంబై మాదిరే 10 రోజులు, బీజింగ్ 9, హనోయి 8, లాగోస్ 6 రోజులు సెలవులు తీసుకుంటారని పేర్కొంది. అధిక సెలవులు తీసుకొనే నగరాల్లో రియాద్(37), మాస్కో(33), సెయింట్ పీటర్బర్గ్(32) బార్సిలోనా(32), దోహా(32) ఉన్నాయి.
కానీ ఇతర నగారాల్లోని ఉద్యోగులకు అందే జీతాలు.. సౌకర్యాలు మాత్రం ముంబైవాసులకు లభించడం లేదట. ఐఫోన్ ఎక్స్ కొనాలంటే న్యూయార్క్‌లో 54గంటలు పనిచేయాల్సి ఉంటే ముంబైలో 917 గంటలు పనిచేయాలట. ఢిల్లీలో 804 గంటలు, కైరోలో అత్యధికంగా 1066.2 గంటలు పనిచేయాలట. జురిచ్లో 38.2 గంటలు, జెనీవాలో 47.5గంటలు , లాస్ ఏంజెల్స్‌లో50.6 గంటలు పనిచేస్తే చాలట.