Manasa Varanasi Corona: 'మిస్ ఇండియా'కు కరోనా పాజిటివ్- మిస్ వరల్డ్ పోటీలు వాయిదా

Manasa Varanasi Corona: 'మిస్ ఇండియా' మానస వారణాసి కరోనా వైరస్ బారిన పడింది. దీంతో ఆమె పాల్గొనాల్సిన మిస్ వరల్డ్ పోటీలను వాయిదా పడింది. ఇదే విషయాన్ని మిస్ వరల్డ్ 2021 నిర్వాహకులు సోషల్ మీడియాలో వెల్లడించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2021, 11:48 AM IST
    • మిస్ ఇండియా మానస వారణాసికి కరోనా పాజిటివ్
    • కరోనా కలకలంతో మిస్ వరల్డ్ పోటీలు వాయిదా
    • 90 రోజుల తర్వాత ఈవెంట్ ను తిరిగి నిర్వహించేందుకు సన్నాహాలు
Manasa Varanasi Corona: 'మిస్ ఇండియా'కు కరోనా పాజిటివ్- మిస్ వరల్డ్ పోటీలు వాయిదా

Manasa Varanasi Corona: మిస్ వరల్డ్ 2021 పోటీపై కరోనా ప్రభావం పడింది. ఇందులో పాల్గొనేందుకు అమెరికాలోని ప్యూర్టోరికోకు వెళ్లిన పలువురు పోటీదారులు కరోనా బారిన పడ్డారు. ఇండియా తరఫున ఈ పోటీల్లో పాల్గొనాల్సిన 'మిస్ ఇండియా 2020' మానస వారణాసికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ పోటీని నిర్వాహకులు తాత్కాలికంగా ఆపేశారు. ఈ మేరకు నిర్వాహకులు మిస్‌ వరల్డ్‌ అధికారిక సోషల్‌మీడియా ఖాతాలో ప్రకటించారు.

అయితే మిస్ వరల్డ్ 2021 పోటీలు అమెరికాలోని ప్యూర్టోరికో వేదికగా డిసెంబరు 16న ప్రారంభం కావాల్సిఉంది. అయితే కరోనా నేపథ్యంలో పోటీదారులు, సిబ్బంది, సాధారణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. రానున్న 90 రోజుల్లో పోటీలను రీషెడ్యూల్‌ చేయనున్నట్లు ప్రకటించారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Miss World (@missworld)

మిస్‌ వరల్డ్‌ 2021 పోటీలకు వెళ్లిన మిస్‌ ఇండియా మానస వారణాసి సహా 17 మంది పోటీదారులు, సిబ్బందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మిస్‌ఇండియా ఆర్గనైజేషన్‌ కూడా అధికారికంగా ధ్రువీకరించింది. ప్రస్తుతం మానస.. ప్యూర్టోరికోలో ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది.

ఎవరీ మానస వారణాసి..?

మానస వారణాసి.. పేరు వింటే నార్త్ ఇండియా అమ్మాయి అనుకున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే! మానస వారణాసి మన తెలుగమ్మాయి. హైదరాబాద్ కు చెందిన 23 ఏళ్ల మానస వారణాసి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మిస్ ఇండియా 2020 పోటీల్లో విజేతగా నిలిచింది. 

ఇప్పుడు జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు మానస వారణాసి.. అమెరికాలోని ప్యూర్టోరికాకు వెళ్లింది. అయితే అంతలోనే కరోనా సోకడం వల్ల పోటీలను వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.   

Also Read: Omicron Variant: భయపెడుతున్న ఒమిక్రాన్ డబ్లింగ్ రేటు, అమెరికాలో లాక్‌డౌన్‌పై నిర్ణయం

Also Read: Plane crash: ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేస్తుండగా కూలిన విమానం- 9 మంది మృతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News