Cheslie Kryst: మిస్ యూఎస్​ఏ 2019 విజేత 'చెస్లీ క్రిస్ట్' ఆత్మహత్య!

Miss USA 2019: మిస్ యూఎస్​ఏ 2019 పోటీల విజేత చెస్లీ క్రిస్ట్(30) మృతి చెందారు. 60 అంతస్తుల భవనం నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2022, 01:48 PM IST
  • మిస్ యూఎస్​ఏ చెస్లీ క్రిస్ట్ మృతి
  • 60 అంతస్తుల భవనం నుంచి కిందపడిన చెస్లీ
  • ఆత్మహత్యగా భావిస్తున్న పోలీసులు
Cheslie Kryst: మిస్ యూఎస్​ఏ 2019 విజేత 'చెస్లీ క్రిస్ట్' ఆత్మహత్య!

Miss USA 2019 Cheslie Kryst dies: మిస్ యూఎస్ఏ 2019 పోటీల విజేత చెస్లీ క్రిస్టీ (30) భవనం మీద నుంచి దూకి మరణించింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు, పోలీసులు ధృవీకరించారు. చెస్లీ (Miss USA 2019 Cheslie Kryst) మృతిపట్ల మిస్ యూనివర్స్-2021 హర్నాజ్ సంధు (Harnaz Sandhu) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని హర్నాజ్ పేర్కొంది. 

 
 
 
 
 

పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆదివారం ఉదయం మాన్హాటన్‌లోని 60 అంతస్తుల బిల్డింగ్‌పై నుంచి కిందపడి చెస్లీ క్రిస్టీ మరణించింది. ఈ ఘటన ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు బయటపడతాయని వారు చెబుతున్నారు. చెస్లీ క్రిస్టీ మరణ వార్త తెలిసి...ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. చెస్లీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

చెస్లీ క్రిస్ట్​ 1991లో మిషిగాన్​ జాక్సన్​లో జన్మించారు. సౌత్​ కరోలినాలో పెరిగారు. చెస్లీ క్రిస్టీ వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీలో ఎంబీఏతోపాటు న్యాయ శాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకుంది. అనంతరం స్థానికంగా ఉన్న న్యూస్ ఛానల్‌లో ఆమె రిపోర్టర్‌గా పని చేసింది. 2019 మిస్​ యూఎస్​ఏ టైటిల్​ గెలుచుకున్నారు.

Also Read: Video: క్రియేటివ్‌గా ట్రై చేశాడు.. అందర్నీ వెనక్కి నెట్టి జాబ్ కొట్టేశాడు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

 

Trending News