నేడు ఆకాశంలో మరో అద్భుతం: భూమికి దగ్గరగా అంగారకుడు

ఆకాశంలో నేడు మరో అద్భుతం జరగనుంది.

Last Updated : Jul 31, 2018, 07:49 PM IST
నేడు ఆకాశంలో మరో అద్భుతం: భూమికి దగ్గరగా అంగారకుడు

ఆకాశంలో నేడు మరో అద్భుతం జరగనుంది. ఐదు రోజుల క్రితం (జులై 27) ప్రపంచం సంపూర్ణ చంద్రగ్రహణాన్ని, అరుణ గ్రహం భూమికి దగ్గరగా రావడాన్ని వీక్షించింది. ఇలాంటి అద్భుతమే విశ్వంలో నేడు చోటుచేసుకోనుంది. అంగారక గ్రహం ఈ రోజు భూమికి అత్యంత దగ్గరగా రానుంది. 15 ఏళ్ల తరువాత అంగారక గ్రహం భూమికి దగ్గరగా రానుంది. మంగళవారం అంగారక గ్రహం భూమికి 57.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో రానుంది. అంగారక గ్రహం సాధారణంగా ప్రకాశవంతంగా ఉంటుంది. మంగళవారం ఇది భూమికి సమీపంలోకి రానుండటంతో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

 

60 వేల సంవత్సరాల తర్వాత అంగారకుడు భూమి దగ్గరగా వచ్చాడని(2013లో)... అప్పుడు భూమికి, అంగారకుడికి మధ్య దూరం 55.7 మిలియన్ కిలోమీటర్లు అని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. 2020లో కూడా అంగారక గ్రహం భూమికి దగ్గరగా వస్తుందని.. అప్పుడు 62 మిలియన్ కిలోమీటర్లు ఉంటుందని వివరించారు. కాగా.. ఆకాశంలో ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమయ్యాయి.

 

Trending News