ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ ఆగ్రహం (Javed Miandad Slams Imran Khan) వ్యక్తం చేశాడు. దేశంలో ఆర్థిక సమస్యలకు, క్రికెట్ సమస్యలకు మొత్తం కారణం ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయాలేనని Javed Miandad ఆరోపించాడు. ఇమ్రాన్ (Imran Khan)ను ప్రధాని చేసింది తానేనని, కానీ ప్రధాన పీఠంపై కూర్చున్నాక ఇమ్రాన్ తనకు తాను దేవుడిగా భావిస్తున్నాడంటూ మండిపడ్డారు. ఇమ్రాన్‌ను పదవి నుంచి దింపితేగానీ పాక్ బాగుపడదని వ్యాఖ్యానించాడు. Sputnik V: రష్యా వ్యాక్సిన్‌పై సీసీఎంబీ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
ఇమ్రాన్‌కు గుఠపాఠం చెప్పేందుకైనా తాను రాజకీయాల్లోకి వస్తానంటూ సవాల్ విసిరాడు. తన సహాయంతో పాక్ ప్రధాని పదవి చేపట్టిన ఇమ్రాన్ తప్పుడు నిర్ణయాలు దేశానికి పెను సవాలుగా మారాయని పేర్కొన్నాడు మియాందాద్. ఇమ్రాన్ తన సహాయంతో ప్రధాని అవకపోతే ఈ విషయాన్ని ఖండించవచ్చునంటూ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూచించాడు. Virat Kohli: రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కోహ్లీ.. కానీ ఓ కండీషన్
పాక్ క్రికెటర్లను నిరుద్యోగులుగా మార్చాడని మియాందాద్ మండిపడ్డాడు. రాజకీయ ఆటలోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా ఏంటో ఇమ్రాన్‌కు రుచి చూపిస్తానని సవాల్ విసిరాడు. పాక్ క్రికెట్‌తో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని వ్యాఖ్యానించాడు. కాగా, 1992 ప్రపంచ కప్ నెగ్గిన పాక్ జట్టులో మియాందాద్ సభ్యుడు కాగా, ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్ కావడం గమనార్హం. Photos: అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...