Complete lockdown in India: ఇండియాలో లాక్‌డౌన్ విధించాలి: డా ఆంథోని ఫాసీ

Dr Anthony Fauci recommended complete lockdown in India: న్యూ ఢిల్లీ: భారత్‌లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం ఉందని అమెరికాకు చెందిన టాప్ మెడికల్ ఎక్స్‌పర్ట్, వైట్ హౌజ్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డా ఆంథోని ఫాసీ అన్నారు. భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతుండంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసిన డా ఆంథోని ఫాసీ.

Written by - ZH Telugu Desk | Last Updated : May 4, 2021, 08:41 PM IST
Complete lockdown in India: ఇండియాలో లాక్‌డౌన్ విధించాలి: డా ఆంథోని ఫాసీ

Dr Anthony Fauci recommended complete lockdown in India: న్యూ ఢిల్లీ: భారత్‌లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం ఉందని అమెరికాకు చెందిన టాప్ మెడికల్ ఎక్స్‌పర్ట్, వైట్ హౌజ్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డా ఆంథోని ఫాసీ అన్నారు. భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతుండంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసిన డా ఆంథోని ఫాసీ.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి, భారీ ఎత్తున కొవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించడం ఒక్కటే కరోనా కట్టడికి పరిష్కారం అని సూచించారు. అలాగే యుద్ధప్రాతిపదికన తాత్కాలిక కొవిడ్-19 హాస్పిటల్స్ నిర్మాణం కూడా చేపట్టాల్సిన అవసరం ఉందని డా ఆంథోని ఫాసీ స్పష్టంచేశారు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డా ఫాసీ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌లో ప్రస్తుతం ఏం జరుగుతుందో యావత్ ప్రపంచం చూస్తోంది. కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఆక్సీజన్ కొరత (Oxygen shortage) తీవ్రంగా ఉంది. మరోవైపు అవసరానికి తగినంత కొవిడ్-19 వ్యాక్సిన్లు లేవు. అందుకే భారత్‌కి యావత్ ప్రపంచం అండగా నిలవాల్సిన అవసరం ఉంది అని డా ఆంథోని ఫాసీ ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. కరోనా రోగులకు చికిత్స (COVID-19 patients) చేసేందుకు అవసరమైన స్థాయిలో మౌళిక సదుపాయాలు లేకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోందని ఆంథోనీ ఫాసీ అభిప్రాయపడ్డారు.

Also read : COVID-19 vaccine తీసుకునే ముందు, తర్వాత ఎలాంటి Foods తినాలి ? ఏవి తినొద్దు ?

భారత్ కరోనా నుంచి బయటపడాలంటే దీర్ఘకాలంలో కొన్ని ప్రణాళికలు అనుసరించాల్సిన అవసరం ఉందన్న డా ఆంథోని ఫాసీ.. ప్రస్తుతానికి యుద్ధ ప్రాతిపదికన అందరికీ వ్యాక్సిన్ ఇప్పించాల్సిన ఆవశ్యకత ఉంది అని పేర్కొన్నారు. అందుకోసం భారత్‌‌లో తయారైన కరోనా వ్యాక్సిన్లతో (COVID-19 vaccine) పాటు అవవసరమైతే అమెరికా, రష్యాలాంటి బయటి దేశాలు ఇచ్చే వ్యాక్సిన్లను కూడా తీసుకోవాలని సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News