Ukraine Crisis: రష్యాకు వ్యతిరేకంగా UNGAలో తీర్మానం ఆమోదం.. మరోసారి ఓటింగ్‌కు దూరంగా భారత్‌..

Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులపై ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. మరోసారి భారత్ ఓటింగ్ కు దూరంగా ఉంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2022, 07:47 AM IST
  • ఉక్రెయిన్‌పై వెంటనే దాడులను నిలిపివేయాలి
  • యూఎన్‌జీఏలో తీర్మానం ఆమోదం
Ukraine Crisis: రష్యాకు వ్యతిరేకంగా UNGAలో తీర్మానం ఆమోదం.. మరోసారి ఓటింగ్‌కు దూరంగా భారత్‌..

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని (Russia aggression) ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పై దాడులు నిలిపివేయాలని, దాని సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యం, ఐకత్య, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉండాలని ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో (UN General Assembly) తీర్మానం ప్రవేశపెట్టారు. 

మొత్తం 193 సభ్య దేశాలు గల జనరల్‌ సభలో తీర్మానానికి 141 దేశాలు మద్దతు తెలిపాయి. తీర్మానానికి వ్యతిరేకంగా 5 దేశాలు ఓటు వేయగా... 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై దాడిని నిలిపివేయాలనే తీర్మానంపై ఓటింగ్ కు భారత్‌ (India) దూరంగా ఉంది.  ఇటీవల రష్యాకు వ్యతిరేకంగా  ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాల్లో భారత్‌ వరుసగా మూడోసారి ఓటింగ్‌కు దూరంగా నిలిచింది.

ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో..రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లోని పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు. ముఖ్యంగా ఖర్కివ్‌, కీవ్‌తో పాటు కల్లోలిత ప్రాంతాల్లో చిక్కుక్కున్న భారతీయులను రష్యా మీదుగా తరలించాలని పుతిన్ (Putin)ను మోదీ కోరారు. భారతీయ విద్యార్థులకు సేఫ్‌ ప్యాసేజ్‌ కల్పించేందుకు రష్యా అంగీకరించిన సంగతి తెలిసిందే. వీరంతా ఖార్కివ్ వీడి వెళ్లేందుకు 6 గంటల సమయమిచ్చింది రష్యా. వాహనాలు, బస్సులు అందుబాటులో లేకపోతే కాలినడకనైనా అక్కడి నుంచి తరలివెళ్లాలని ఇండియన్ ఎంబసీ సూచించింది. ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది. 

Also Read: Indian Student Dies in Ukraine: ఉక్రెయిన్​లో మరో భారత విద్యార్థి మృతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News